SS Rajamouli: ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి.. ఏమన్నారంటే ?..

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సిక్వెల్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. గతంలోనే ఈ సిక్వెల్ పై స్పందించారు జక్కన్న. తాజాగా మరోసారి ట్రిపుల్ సిక్వెల్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

SS Rajamouli: ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి.. ఏమన్నారంటే ?..
Rajamouli
Follow us

|

Updated on: Mar 15, 2023 | 6:52 AM

అంతర్జాతీయ వేదికపై డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. ప్రపంచదేశాల సినీ ప్రియులను మెప్పిస్తూ..విశ్వవేదికపై ఎన్నో అవార్డ్స్ అందుకుంది. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్, హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఛాయిస్ అవార్డ్స్ మాత్రమే కాదు.. సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరు ఒక్కసారైనా అందుకోవాలనుకునే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ ఆస్కార్‏ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటరిగిలో అకాడమీ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలలో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డ్స్ అందుకున్నారు. దీంతో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సిక్వెల్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. గతంలోనే ఈ సిక్వెల్ పై స్పందించారు జక్కన్న. తాజాగా మరోసారి ట్రిపుల్ సిక్వెల్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తాజాగా ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డ్ తనను మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ప్రేరేపిస్తుందని అన్నారు. ఆస్కార్ అవార్డ్ రావడంతో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సిక్వెల్ మరింత వేగంగా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

రాజమౌళి మాట్లాడుతూ.. “సినిమా విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు సీక్వెల్ చేయాలనుకున్నాము. అప్పుడు మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కానీ అంత స్పష్టంగా అనుకోలోదు. కానీ విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. దీంతో నేను మా నాన్న, మా కజిన్ ఎంఎం కీరవాణితో మరోసారి చర్చించినప్పుడు నాకు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. దీంతో వెంటనే మా నాన్న స్క్రిప్ట్ రాయడం ప్రారంభించారు. స్క్రిప్ట్ పూర్తయ్యే వరకు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లలేము. కానీ వీలైనంత తొందరగా సీక్వెల్ పూర్తి చేస్తాము” అంటూ చెప్పుకొచ్చారు.

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి