Rahul Sipligunj: శంషాబాద్ విమానాశ్రయానికి సింగర్ రాహుల్ సిప్లీగంజ్.. అభిమానుల ఘన స్వాగతం

Subhash Goud

Subhash Goud |

Updated on: Mar 18, 2023 | 11:35 PM

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ సాంగ్‌ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ తరువాత సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆస్కార్ వేదిక పై ఈ నాటు నాటు పాటను..

Rahul Sipligunj: శంషాబాద్ విమానాశ్రయానికి సింగర్ రాహుల్ సిప్లీగంజ్.. అభిమానుల ఘన స్వాగతం
Rahul Sipligunj

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ సాంగ్‌ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ తరువాత సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆస్కార్ వేదిక పై ఈ నాటు నాటు పాటను రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ఆస్కార్‌ ఆవార్డ్‌ తర్వాత హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌కు అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి రాహుల్ సిప్లి గoజ్ అభిమానుల భారీ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ ఇంటి వద్ద అభిమానుల హంగామా చేశారు. అభిమానులు గజమాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా రాహుల్‌ సిప్లీగంజ్‌ టీవీ9తో మాట్లాడుతూ.. జీవితంలో ఇలాంటి మూమెంట్‌ వస్తుందని అనుకోలేదని, కీరవాణికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. 18నెలల కష్టానికి ఫలితం దక్కిందని, ప్రతి ఒక్కరి ట్వీట్‌ ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు. ఆస్కార్‌ వేదికపై పాట పడటం ఒక కల.. ఆ కల నెరవేరిందన్నారు. ఇంట్లో వాళ్లు చాలా ఎమోషన్‌ అయ్యారని, కష్టపడితే ఏదైనా సాధ్యమే అని నిరూపించిన తరుణమిదని పేర్కొన్నారు. ప్రీ ఆస్కార్స్‌ టైమ్‌లో ప్రియాంక చోప్రా పార్టీ మర్చిపోలేనిదని అన్నారు.

ఇవి కూడా చదవండి


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu