Janhvi Kapoor: తారక్ అంటే అంత ఇష్టమేంటీ జాన్వీ.. అందుకోసం రోజులు లెక్కపెడుతోందట పాపం..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Mar 18, 2023 | 9:25 PM

ఎన్టీఆర్ తేజస్సు చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

Janhvi Kapoor: తారక్ అంటే అంత ఇష్టమేంటీ జాన్వీ.. అందుకోసం రోజులు లెక్కపెడుతోందట పాపం..
Janhvi Kapoor, Ntr

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే బీటౌన్‏లో అగ్రకథానాయికగా ఉన్న జాన్వీ ఇప్పుడు దక్షిణాదిలో సినిమాలు చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. తనవరకు స్టోరీస్ వస్తే తప్పకుండా చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ గతంలోనే చెప్పేసింది. ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటించనున్న చిత్రంలో జాన్వీ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. ఫస్ట్ అప్డేట్స్ వచ్చి నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఈ మూవీ పట్టాలెక్కలేదు. దీంతో అభిమానులలో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం తాను కూడా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నానంటూ చెప్పుకొచ్చింది జాన్వీ.

ఢిల్లీలో ఇండియా టూడే నిర్వహించిన కాన్‏క్లేవ్ 2023 కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ తారక్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ మూవీ షూటింగ్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. అలాగే తారక్‏తో కలిసి పనిచేసేందుకు చాలా ఎగ్జైట్‎గా ఉన్నానని చెప్పింది.

“ఎన్టీఆర్ తేజస్సు చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సినిమా ఎప్పుడూ ప్రారంభమవుతుందా అని రోజులు లెక్కబెడుతున్నాను. ప్రతిరోజూ దర్శకుడికి మెసేజ్ చేస్తున్నాను నేను. తారక్ తో కలిసి పనిచేయడం నా కల. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా చూశాను. అతని నటన.. తేజస్సు నన్ను ఆకట్టుకున్నాయి. అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా జీవితంలో అతి పెద్ద సంతోషాలలో ఒకటి” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు.. ఎన్టీఆర్ సినిమాలో తనకు అవకాశం రావాలని దేవుడి ప్రార్ధించిందట. అలాగే ప్రతి ఇంటర్వ్యూలో తనకు తారక్ తో కలిసి నటించాలని ఉందని చెప్పానని… చివరకు ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ రావడం పట్ల సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. జాన్వీ చివరిసారిగా మిలీ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రంలో నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu