AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Vamsi: ‘రమ్యకృష్ణతో ఆ సీన్ చేస్తున్నప్పుడు గుండె రాయి చేసుకున్న’.. కృష్ణవంశీ కంటతడి..

అందరి హృదయాలను కృష్ణవంశీ టచ్ చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారుు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ రమ్యకృష్ణ పాత్రను ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Krishna Vamsi: 'రమ్యకృష్ణతో ఆ సీన్ చేస్తున్నప్పుడు గుండె రాయి చేసుకున్న'.. కృష్ణవంశీ కంటతడి..
Krishnavamshi
Rajitha Chanti
|

Updated on: Mar 18, 2023 | 9:28 PM

Share

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందిస్తోన్న లేటేస్ట్ చిత్రం రంగమార్తండ. చాలా గ్యాప్ తర్వాత ఆయన తెరెక్కిస్తోన్న ఈ మూవీ పై ఇప్పటికే అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇందులో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మనందం ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన సినీ ప్రముఖులు సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. నటీనటులు.. కృష్ణవంశీ టేకింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరి హృదయాలను కృష్ణవంశీ టచ్ చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారుు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ రమ్యకృష్ణ పాత్రను ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

“ఇందులో రమ్యకృష్ణ పాత్రను చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశాను. మా ఇంట్లో ఏ నిర్ణయమైనా నా భార్యే తీసుకుంటుంది. ఒకవేళ రమ్య లేనప్పుడు మేము నిర్ణయం తీసుకున్నా దానిలో మార్పులు చేర్పులు చేయమని సూచిస్తుంటుంది. కానీ నేను పెద్దగా పట్టించుకోను. రమ్యకు శక్తివంతమైన కళ్లు ఉన్నాయి. అరుపులు, కేకలు కాకుండా కళ్లతోనే నటించాలి అని చెప్పగానే ఈ సినిమా చేసేందుకు ఒప్పుకుంది. తన మేకప్, హెయిర్ స్టైల్ తనే చేసుకుంది. తనెప్పుడు ఒక విజన్ తో ముందుకెళ్తుంది.

క్లైమాక్స్‏లో ఒక సీన్ ను ఆమెపై షూట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. నిజానికి ఆ సీన్ రాస్తున్నప్పుడే చాలా బాధ కలిగింది. దాదాపు 36 గంటలపాటు షూట్ జరిగింది. తనను ఆ సన్నివేశంలో చిత్రీకరించేందుకు సెంటిమెంట్ అడ్డొచ్చింది. కానీ తప్పుకదా.. షూటింగ్ చేస్తున్న సమయంలో కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఆ రాత్రి నేను సరిగా నిద్రపోలేకపోయాను. ఒకరకంగా చెప్పాలంటే గుండె రాయి చేసుకుని షూటింగ్ చేశాను” అంటూ కృష్ణవంశీ ఎమోషనల్ అయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
‘మా ఇంటి బంగారం’ మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
‘మా ఇంటి బంగారం’ మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
మాంసం కూరలను తలదన్నే వంకాయ కర్రీ.. చెట్టినాడు స్టైల్‌లో
మాంసం కూరలను తలదన్నే వంకాయ కర్రీ.. చెట్టినాడు స్టైల్‌లో
తక్కువ ధరకే రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బైక్.. చూస్తే షాకే
తక్కువ ధరకే రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బైక్.. చూస్తే షాకే
సిగ్నల్‌ కట్ కావడాన్ని లైట్‌గా తీసుకుంటే అకౌంట్ ఖాళీ
సిగ్నల్‌ కట్ కావడాన్ని లైట్‌గా తీసుకుంటే అకౌంట్ ఖాళీ
కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న మా ఇంటి బంగారం
కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న మా ఇంటి బంగారం