AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీ గొప్ప మనసుకు దండాలయ్యా.. కిడ్నీ సమస్యలతో బాధపడుతోన్న ‘బలగం’ సింగర్స్‌కు డైరెక్టర్‌ వేణు ఆర్థిక సాయం

బలగం సినిమా విజయంలో పాటలు కూడా కీలక పాత్ర పోషించాయి. మరీ ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో వచ్చే బుడగ జంగాల పాట అయితే నెక్ట్స్‌ లెవెల్‌ అంతే. స్వచ్ఛమైన తెలంగాణ మాండలికంతో కూడిన ఈ బుర్ర కథ గానాన్ని వరంగల్‌ జిల్లాకు చెందిన కొమురవ్వ, మొగిలయ్యలు అద్భుతంగా ఆలపించారు.

నీ గొప్ప మనసుకు దండాలయ్యా.. కిడ్నీ సమస్యలతో బాధపడుతోన్న 'బలగం' సింగర్స్‌కు డైరెక్టర్‌ వేణు ఆర్థిక సాయం
Director Venu
Basha Shek
|

Updated on: Mar 18, 2023 | 3:26 PM

Share

తెలంగాణ భాష, యాస, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఎంతో హృద్యంగా తెరకెక్కిన చిత్రం బలగం. జబర్దస్త్‌ కమెడియన్‌ యెల్దండి వేణు డైరెక్టర్‌గా మారి ఎంతో అద్భుతంగా ఈ సినిమాను రూపొందించారు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 3 న విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. పెద్ద స్టార్‌ క్యాస్ట్‌ లేనప్పటికీ కేవలం మౌత్‌ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సినిమాకు బాగా కనెక్ట్‌ అయ్యారు. మెగాస్టార్‌ చిరంజీవి లాంటి పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాను చూసి బలగం యూనిట్‌ను అందించారు. ఇదిలా ఉంటే బలగం సినిమా విజయంలో పాటలు కూడా కీలక పాత్ర పోషించాయి. మరీ ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో వచ్చే బుడగ జంగాల పాట అయితే నెక్ట్స్‌ లెవెల్‌ అంతే. స్వచ్ఛమైన తెలంగాణ మాండలికంతో కూడిన ఈ బుర్ర కథ గానాన్ని వరంగల్‌ జిల్లాకు చెందిన కొమురవ్వ, మొగిలయ్యలు  ఆలపించారు. ఈ పాటతో కోట్లాది మంది మనసులు గెల్చుకున్న వీరు నిజ జీవితంలో మాత్రం ఎంతో దీన స్థితిలో ఉన్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మొగిలయ్యకు రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయి. ఎంతో ఖర్చు పెట్టి డయాలసిస్‌ ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నాడు.

మొగిలయ్య దీన పరిస్థితి గురించి తెలుసుకున్న డైరెక్టర్‌ వేణు వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చాడు. వరంగల్‌ జిల్లా దుగ్గొండిలోని కొమురవ్వ, మొగిలయ్య ఇంటికి వెళ్లి రూ.లక్ష ఆర్థికసాయంగా అందజేశారు. అంతేకాదు నిర్మాత దిల్‌రాజ్‌తో మాట్లాడి మరింత ఆర్థికసాయం అందేలా చూస్తానని మొగిలయ్య దంపతులకు హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వంతో మాట్లాడి వైద్య సాయంతో పాటు ఉచితంగా మందులు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కొమురవ్వ, మొగిలయ్యలను డైరెక్టర్ వేణు తన మిత్ర బృందంతో కలిసి ఘనంగా సత్కరించారు. స్థానిక నాయకులు, గేయ రచయిత కాసర్ల శ్యామ్‌, యాంకర్‌ గీత భగత్‌ కలిసి మొగిలయ్య దంపతులకు 70 వేల రూపాయలు అందించారు. మరో 30 వేల రూపాయలు ఆయన బ్యాంక్‌ అకౌంట్‌లో డిపాజిట్‌ చేశారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. వెళ్లేటప్పుడు మొగిలయ్య దంపతులకు ధైర్యం చెప్పారు. బలగం సినిమాతో మంచి డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు. అలాగే మరుగున పడిపోతున్న మొగిలయ్య లాంటి ఎంతోమంది కళాకారులను వెలుగులోకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు వారి కుటుంబానికి రూ. లక్ష సాయం అందించి వేణు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడని అభిమానులు, నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

డైరెక్టర్ వేణు ఫేస్ బుక్ లో షేర్ చేసిన పోస్ట్ :

ఇవి కూడా చదవండి

బలగం సినిమాలో మొగిలయ్య ఆలపించిన పాట ఇదే..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
"వాడి జీవితం ఇలా అవుతుంది అని కలలో కూడా అనుకోలేదు"
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్