AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eggless Rava Cake: ఓవెన్ లేకుండా కుక్కర్లోనే బేకరీ కంటే సాఫ్ట్‌గా స్పాంజ్ కేక్

ఇంట్లో పుట్టినరోజులు, చిన్న చిన్న వేడుకలు జరిగినప్పుడు కేక్ చేయాలంటే చాలామందికి గ్రాముల లెక్కలు, బేకింగ్ టూల్స్, ఓవెన్ ఉండాలనే బెంగ ఉంటుంది. కానీ ఎలాంటి కొలత స్కేల్స్ లేకుండా ప్రతి ఇంట్లో ఉండే ఒకే ఒక కప్పు కొలతతో.. కోడిగుడ్లు లేకుండా బొంబాయి రవ్వతో (సూజీ) నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయేంత మాయిస్ట్‌గా, సూపర్ స్పాంజీ రవ్వ కేక్‌ను కుక్కర్‌లోనే చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు.

Phani CH
|

Updated on: Nov 01, 2026 | 5:06 PM

Share
కావలసిన పదార్థాలు: 1¼ కప్పుల బొంబాయి రవ్వ, 1 కప్పు పంచదార, అర కప్పు మైదా పిండి, అర కప్పు కమ్మని తాజా పెరుగు, అర కప్పు కాచిన లేదా పచ్చి పాలు, అర కప్పు రిఫైన్డ్ ఆయిల్ లేదా కరిగించిన వెన్న, 2 టేబుల్ స్పూన్ల పాలపొడి, అర టీస్పూన్ బేకింగ్ పౌడర్, అర టీస్పూన్ బేకింగ్ సోడా, పావు టీస్పూన్ ఉప్పు, 1 టీస్పూన్ వెనీలా ఎసెన్స్ లేదా అర టీస్పూన్ యాలకుల పొడి, పావు కప్పు టూటీ ఫ్రూటీ లేదా డ్రై ఫ్రూట్స్

1 / 6
తయారీ విధానం: 7 అంగుళాల కేక్ టిన్ లేదా అల్యూమినియం గిన్నెను తీసుకుని.. 1 టీస్పూన్ నూనె వేసి అంచుల వరకు బాగా పూయాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసి టిన్ అంతా సమానంగా డస్ట్ చేసి అదనపు పిండిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్‌లో అర కప్పు రిఫైన్డ్ ఆయిల్, రూమ్ టెంపరేచర్‌లో ఉన్న అర కప్పు తాజా పెరుగు, అర కప్పు పాలు పోయాలి. విస్కర్ సహాయంతో నూనె, పాలు, పెరుగు కలిసిపోయి నురుగులా మారే వరకు బాగా కలపాలి.

2 / 6
ఇందులో 1¼ కప్పుల బొంబాయి రవ్వను కొద్దికొద్దిగా పోస్తూ ఎక్కడా ఉండలు కట్టకుండా విస్కర్‌తో కలపాలి. ఆ తర్వాత 1 కప్పు పంచదార పొడిని వేసి పంచదార పూర్తిగా కరిగిపోయే వరకు బాగా తిప్పాలి. బౌల్ పై జల్లెడ పెట్టి.. అర కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్, అర టీస్పూన్ బేకింగ్ పౌడర్, అర టీస్పూన్ బేకింగ్ సోడా, పావు టీస్పూన్ ఉప్పు వేసి జల్లించాలి.

3 / 6
స్పాచులాతో పిండిని గట్టిగా తిప్పకుండా చాలా సున్నితంగా 'కట్ అండ్ ఫోల్డ్' పద్ధతిలో ఉండలు లేకుండా కలపాలి. ఇందులో 1 టీస్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి కలపాలి. చిన్న గిన్నెలో పావు కప్పు టూటీ ఫ్రూటీలను తీసుకుని 2 టీస్పూన్ల మైదా పిండి వేసి బాగా కలిపి.. ఆ టూటీ ఫ్రూటీలను కేక్ బ్యాటర్‌లో వేసి నెమ్మదిగా కలపాలి. ఇప్పుడు ఈ బ్యాటర్‌ను సిద్ధం చేసుకున్న కేక్ టిన్‌లోకి పోసి రెండు సార్లు సున్నితంగా టాప్ చేయాలి.

4 / 6
కుక్కర్ లేదా పాత్రలో బేకింగ్: వెడల్పాటి అడుగు మందపాటి గిన్నె లేదా కుక్కర్‌ను హై ఫ్లేమ్‌పై మూతపెట్టి 10 నిమిషాలు ప్రీ-హీట్ చేయాలి. ఆ తర్వాత అడుగున స్టాండ్ ఉంచి, కేక్ టిన్‌ను మధ్యలో పెట్టి మూత మూయాలి. కుక్కర్ అయితే గ్యాస్‌కెట్, విజిల్ తీసేయాలి. మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.

5 / 6
ఓవెన్‌లో బేకింగ్: 180 డిగ్రీల వద్ద 10 నిమిషాలు ప్రీ-హీట్ చేసి.. 180 డిగ్రీల వద్దే 40 నిమిషాలు బేక్ చేయాలి. మధ్యలోకి టూత్‌పిక్ గుచ్చి చూస్తే ఏమాత్రం తడి అంటుకోకుండా క్లీన్‌గా బయటకు వస్తే కేక్ పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్లు. కేక్ టిన్‌ను బయటకు తీసి ఒక పొడి కాటన్ క్లాత్ కప్పి గది ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే అంచులను విడిపించి ప్లేట్‌లోకి తిరగేస్తే కేక్ అతుక్కోకుండా బయటకు వస్తుంది. ఇప్పుడు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే, నోరూరించే సూపర్ స్పాంజీ 'ఎగ్‌లెస్ రవ్వ కేక్' సిద్ధం! నొక్కితే స్పాంజ్‌లా పైకి లేస్తూ, నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతూ టూటీ ఫ్రూటీల తీపితో పిల్లలకు అత్యంత ఇష్టమైన హెల్దీ స్నాక్‌గా నిలుస్తుంది!

6 / 6
Follow Us
ఓవెన్ లేకుండా కుక్కర్లోనే బేకరీ కంటే సాఫ్ట్‌గా స్పాంజ్ కేక్

Video:కష్టపడి మెట్లు ఎక్కిన దివ్యాంగ డెలివరీ బాయ్‌.. చివరకు షాక్

తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చినా పేరు కనిపిస్తుంది!

వంట రాని వారు కూడా చేసుకోగలిగే ఈజీ చికెన్ పులావ్

బాన్సువాడలో నాటు బాంబుల పేలుడు.. ఆరుగురికి సీరియస్!

బయటకు డెయిరీ ఫామ్.. లోపల మత్తు దందా..
బయటకు డెయిరీ ఫామ్.. లోపల మత్తు దందా..
హాఫ్ సెంచరీ తర్వాత వింత సెలబ్రేషన్స్.. అసలేంటీ ‘మాన వేవ్’ స్టోరీ

సీతగా సాయి పల్లవి.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మందార పూలతో ఇంట్లోనే నేచురల్ హెయిర్ కండిషనర్ తయారీ.. రఫ్‌గా ఉన్న

వాట్సాప్ గ్రూప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 4 కొత్త ఫీచర్లు