AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మసకబారిన బంగారు ఆభరణాలకు సరికొత్త మెరుపు.. ఇంట్లోనే గోల్డ్ చైన్, ఇయర్ రింగ్స్ క్లీన్ చేసే ఈజీ చిట్కాలు!

నిత్యం ధరించే బంగారు ఆభరణాలపై దుమ్ము, చెమట, క్రీములు పేరుకుపోవడంతో కాలక్రమేణా వాటి మెరుపు తగ్గిపోతుంది. వీటిని శుభ్రం చేయడానికి ప్రతీసారీ బంగారం దుకాణానికి వెళ్లి డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఇంట్లోనే సులభంగా బంగారు గొలుసులు, ఇయర్ రింగ్స్‌ను కొత్త వాటిలా మెరిపించవచ్చు. ఆ తర్వాత బయటకు తీసి సాఫ్ట్ టూత్‌బ్రెస్ట్‌పై కొద్దిగా టూత్‌పేస్ట్ లేదా షాంపూ వేసి సున్నితంగా రుద్దాలి. చివరగా మంచి నీళ్లతో కడిగి పొడి గుడ్డతో తుడిస్తే బంగారు నగలు సరికొత్త కాంతితో మెరుస్తాయి. ఫుల్ డిటెల్స్ ఇప్పుడు చూద్దాం..

మసకబారిన బంగారు ఆభరణాలకు సరికొత్త మెరుపు.. ఇంట్లోనే గోల్డ్ చైన్, ఇయర్ రింగ్స్ క్లీన్ చేసే ఈజీ చిట్కాలు!
Gold Jewellery Cleaning
Jyothi Gadda
|

Updated on: Nov 01, 2026 | 8:17 PM

Share

మనం రోజూ ధరించే బంగారు గొలుసులు, చెవిపోగులు వంటి ఆభరణాలు కాలక్రమేణా తమ సహజమైన మెరుపును కోల్పోతుంటాయి. దీనికి ప్రధాన కారణం వాటిపై పేరుకుపోయే దుమ్ము, ధూళి, చెమట, బాడీ లోషన్లు, సబ్బుల అవశేషాలు. నగలు మురికిగా మారగానే చాలామంది వాటిని శుభ్రం చేయడానికి జ్యువెల్లరీ షాప్‌కి తీసుకెళ్తుంటారు. అయితే, అక్కడ అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే బదులు, ఇంట్లోనే కొన్ని సాధారణ వస్తువుల సహాయంతో బంగారు నగలను సరికొత్తగా మెరిపించుకోవచ్చు.

ఇంట్లో బంగారం శుభ్రం చేసే పద్ధతి:

ముందుగా ఒక గిన్నెలో లేదా పాన్‌లో ఒక కప్పు నీరు పోసి వేడి చేయాలి. నీరు కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో అర టీస్పూన్ బేకింగ్ సోడా వేయాలి. ఇప్పుడు మీ బంగారు గొలుసులు లేదా ఇయర్ రింగ్స్‌ను ఆ నీటిలో వేసి సుమారు 5 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా చేయడం వల్ల నగల మూలల్లో ఇరుక్కున్న మొండి జిడ్డు, మురికి సులభంగా వదులుతుంది. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నగలను బయటకు తీయాలి. ఇప్పుడు ఒక మృదువైన టూత్‌బ్రెష్‌పై కొద్దిగా టూత్‌పేస్ట్ లేదా మైల్డ్ షాంపూ వేసి, ఆ ఆభరణాలను సున్నితంగా రుద్దాలి. దీనివల్ల నగలపై ఉన్న నలుపుదనం తొలగిపోతుంది.

క్లీన్ చేసిన తర్వాత ఆభరణాలను స్వచ్ఛమైన నీటితో రెండు, మూడు సార్లు బాగా కడగాలి. చివరగా ఒక పొడి, మెత్తని కాటన్ గుడ్డతో నీటి తడి లేకుండా పూర్తిగా తుడిచి ఆరబెట్టాలి. నగలకు మరింత కాంతి రావాలంటే, కొద్దిగా పసుపును తీసుకుని వాటిపై తేలికపాటిగా రుద్ది ఆ తర్వాత కడగవచ్చు. అయితే ఒక ముఖ్యమైన గమనిక ఏమిటంటే.. మీ ఆభరణాలలో విలువైన ముత్యాలు లేదా సున్నితమైన స్టోన్స్ పొదిగి ఉంటే వాటిని వేడి నీటిలో మరిగించకూడదు. అలాగే గోల్డ్-ప్లేటెడ్ ఆభరణాలను ఇలా రుద్ది శుభ్రం చేస్తే పై పూత ఊడిపోయే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ చిన్నపాటి ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా మీ బంగారు నగల మెరుపును ఎప్పటికీ పదిలంగా కాపాడుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us