AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గేమింగ్​ లవర్స్​కి కిక్ ఇచ్చేందుకు వన్​ప్లస్ రెడీ.. ఫీచర్లతో అదరగొట్టేస్తున్న Ace 7

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే వినియోగదారులను ఆకట్టుకునేందుకు OnePlus కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. OnePlus Ace 7 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ముఖ్యంగా గేమింగ్, హై-పెర్ఫార్మెన్స్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మొబైల్‌ను రూపొందించారు. ఇందులో 185Hz వరకు రిఫ్రెష్ రేట్ అందించే డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 V సిరీస్ ప్రాసెసర్, 200MP ప్రధాన కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ఏకంగా 9000mAh భారీ బ్యాటరీని అందించడం మరో ప్రత్యేకత. ఈ ఫోన్‌తో పాటు OnePlus Ace 7 Pro మోడల్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది.

గేమింగ్​ లవర్స్​కి కిక్ ఇచ్చేందుకు వన్​ప్లస్ రెడీ.. ఫీచర్లతో అదరగొట్టేస్తున్న Ace 7
Oneplus Ace 7
Nikhil
|

Updated on: Nov 01, 2026 | 8:20 PM

Share

OnePlus Ace 7లో గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక కూలింగ్ వ్యవస్థతో పాటు పలు అదనపు చిప్‌లను అందించారు. టచ్ రెస్పాన్స్, మోషన్ కంట్రోల్, నెట్‌వర్క్ పనితీరు, ఫ్రేమ్ స్టెబిలిటీ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన భారీ బ్యాటరీ కూడా ఇందులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో అమ్మకాలకు అందుబాటులోకి వచ్చింది. దీని ధరలు కూడా ప్రకటించారు.

185Hz రిఫ్రెష్ రేట్..

OnePlus Ace 7లో 6.78 అంగుళాల 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్‌ప్లేను అందించారు. ఇది 2772×1272 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. సాధారణ వినియోగంలో 1Hz నుంచి 165Hz వరకు డైనమిక్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. సపోర్ట్ చేసే గేమ్స్‌లో మాత్రం 185Hz వరకు రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. గరిష్ఠంగా 2,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

పెర్ఫార్మెన్స్ కోసం 3nm టెక్నాలజీ ఆధారిత Snapdragon 8 Elite Gen 5 V సిరీస్ ప్రాసెసర్‌తో పాటు Adreno 840 GPUని ఉపయోగించారు. ఇందులో 12GB, 16GB LPDDR5X RAM ఆప్షన్లు, 256GB, 512GB UFS 4.1 స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. గేమింగ్ సమయంలో వేడిని నియంత్రించేందుకు డ్యూయల్ ఛానల్ ఐస్ రివర్ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. టచ్ రెస్పాన్స్ కోసం T3 టచ్ చిప్, మోషన్ కంట్రోల్ కోసం 800Hz గైరోస్కోప్, నెట్‌వర్క్ పనితీరు కోసం G3 చిప్, ఫ్రేమ్ స్టెబిలిటీ కోసం P4 డిస్‌ప్లే చిప్‌ను కూడా ఇచ్చారు.

9000mAh భారీ బ్యాటరీ

కెమెరా విభాగంలో OnePlus Ace 7 వెనుకవైపు OIS సపోర్ట్‌తో కూడిన 200MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16MP కెమెరా ఉంది. వెనుక కెమెరాతో 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు.

ఈ ఫోన్‌లో 9000mAh సామర్థ్యం కలిగిన గ్లేసియర్ బ్యాటరీని ఉపయోగించారు. దీనికి 100W SuperVOOC వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. పవర్ బైపాస్ టెక్నాలజీ వల్ల గేమింగ్ వంటి పనులు చేస్తున్నప్పుడు ఛార్జర్ నుంచి నేరుగా ఫోన్‌కు పవర్ అందుతుంది. దీంతో బ్యాటరీపై వేడి, ఒత్తిడి తగ్గుతాయి. మెటల్ మిడిల్ ఫ్రేమ్, 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ ఇచ్చారు. Android 17 ఆధారిత ColorOS 17తో పనిచేసే ఈ ఫోన్‌లో 5G, Wi-Fi 7, Bluetooth 5.4, NFC కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

ధర విషయానికి వస్తే చైనాలో 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 4,399 యువాన్లు (సుమారు రూ.62,855). 16GB + 256GB మోడల్ ధర 4,899 యువాన్లు (రూ.70,000)గా ఉంది. 12GB + 512GB వేరియంట్ ధర 5,199 యువాన్లు (రూ.74,290) కాగా, టాప్ 16GB + 512GB మోడల్ ధర 5,699 యువాన్లు (రూ.81,430)గా నిర్ణయించారు. ఈ ఫోన్ విక్రయాలు ఇప్పటికే చైనాలో ప్రారంభమయ్యాయి.

Follow Us