AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Calling: మీ ఫోన్‌కు గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్స్‌ వస్తున్నాయా? నవంబర్ 1 నుంచి కొత్త రూల్‌

Mobile Calling: CNAP ద్వారా కనిపించే పేరు ఆ సిమ్ ఎవరి పేరుతో రిజిస్టర్ అయిందో తెలియజేస్తుంది. అయితే ఆ సిమ్‌ను వాస్తవంగా ఎవరు ఉపయోగిస్తున్నారో కచ్చితంగా చెప్పదు. అలాగే పేరు కనిపించిందని ఆ కాల్ సురక్షితమైనదని భావించకూడదు. ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు, యూపీఐ పిన్‌లను ఎవరికీ చెప్పకూడదు..

Mobile Calling: మీ ఫోన్‌కు గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్స్‌ వస్తున్నాయా? నవంబర్ 1 నుంచి కొత్త రూల్‌
Mobile Calling
Subhash Goud
|

Updated on: Nov 01, 2026 | 4:52 PM

Share

Mobile Calling: స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించే వారికి కేంద్ర ప్రభుత్వం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. సాధారణంగా మన ఫోన్‌కు కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు అవతలి వ్యక్తి ఎవరో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే ఇకపై అలాంటి ఇబ్బందులు తగ్గనున్నాయి. గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్స్ వచ్చినప్పుడు కూడా ఫోన్ స్క్రీన్‌పై కాలర్ పేరు కనిపించేలా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. ఈ సదుపాయానికి కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) అని పేరు పెట్టారు. దేశంలోని టెలికాం ఆపరేటర్లు నవంబర్ 1 నుంచి ఈ సేవను అమలు చేయాలని కేంద్ర టెలికాం శాఖ ఆదేశించింది.

ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

ప్రస్తుతం మన ఫోన్‌లో సేవ్ చేసుకున్న నంబర్ల నుంచి కాల్ వస్తే మాత్రమే పేర్లు కనిపిస్తాయి. కొత్త CNAP విధానంలో మాత్రం సేవ్ చేయని నంబర్ల నుంచి కాల్ వచ్చినా, ఆ సిమ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాల్లో ఉన్న పేరు కనిపిస్తుంది. ఉదాహరణకు మీకు కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చిందనుకుందాం. ఆ నంబర్ మీ కాంటాక్ట్స్‌లో లేకపోయినా, సిమ్ యజమాని పేరును ఫోన్ స్క్రీన్‌పై చూడవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు.

ఏ నెట్‌వర్క్‌లలో అందుబాటులో ఉంటుంది?

ప్రారంభంలో ఈ సేవను 4G, 5G తదితర కొత్త తరం మొబైల్ నెట్‌వర్క్‌లలో అమలు చేయనున్నారు. 2G, 3G నెట్‌వర్క్‌లు, ల్యాండ్‌లైన్ ఫోన్లకు ఈ సదుపాయం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇంకా ప్రత్యేక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఫోన్‌లో సేవ్ చేసిన పేరుకే ప్రాధాన్యత

మీ ఫోన్‌లో ఇప్పటికే ఒకరి నంబర్‌ను ఏదైనా పేరుతో సేవ్ చేసుకుంటే, కాల్ వచ్చినప్పుడు మీరు సేవ్ చేసిన పేరే కనిపిస్తుంది. నంబర్ సేవ్ చేయని సందర్భంలో మాత్రం టెలికాం సంస్థల వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా పేరు చూపిస్తారు. విదేశాల నుంచి వచ్చే కాల్స్ విషయంలో ‘International Call’ అని కనిపిస్తుంది.

ఒక విషయం గుర్తుంచుకోవాలి

CNAP ద్వారా కనిపించే పేరు ఆ సిమ్ ఎవరి పేరుతో రిజిస్టర్ అయిందో తెలియజేస్తుంది. అయితే ఆ సిమ్‌ను వాస్తవంగా ఎవరు ఉపయోగిస్తున్నారో కచ్చితంగా చెప్పదు. అలాగే పేరు కనిపించిందని ఆ కాల్ సురక్షితమైనదని భావించకూడదు. ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు, యూపీఐ పిన్‌లను ఎవరికీ చెప్పకూడదు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను గుర్తించడంలో CNAP ఉపయోగపడుతుంది. అయితే ఈ సేవ అందరికీ ఒకేసారి కనిపించకపోవచ్చు. టెలికాం సంస్థల అమలు ప్రక్రియను బట్టి అందుబాటులోకి రావచ్చు.

Follow Us
Video:కష్టపడి మెట్లు ఎక్కిన దివ్యాంగ డెలివరీ బాయ్‌.. చివరకు షాక్
Video:కష్టపడి మెట్లు ఎక్కిన దివ్యాంగ డెలివరీ బాయ్‌.. చివరకు షాక్
తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చినా పేరు కనిపిస్తుంది!
తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చినా పేరు కనిపిస్తుంది!
వంట రాని వారు కూడా చేసుకోగలిగే ఈజీ చికెన్ పులావ్
వంట రాని వారు కూడా చేసుకోగలిగే ఈజీ చికెన్ పులావ్
బాన్సువాడలో నాటు బాంబుల పేలుడు.. ఆరుగురికి సీరియస్!
బాన్సువాడలో నాటు బాంబుల పేలుడు.. ఆరుగురికి సీరియస్!
బయటకు డెయిరీ ఫామ్.. లోపల మత్తు దందా..
బయటకు డెయిరీ ఫామ్.. లోపల మత్తు దందా..
హాఫ్ సెంచరీ తర్వాత వింత సెలబ్రేషన్స్.. అసలేంటీ ‘మాన వేవ్’ స్టోరీ
హాఫ్ సెంచరీ తర్వాత వింత సెలబ్రేషన్స్.. అసలేంటీ ‘మాన వేవ్’ స్టోరీ
సీతగా సాయి పల్లవి.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
సీతగా సాయి పల్లవి.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
మందార పూలతో ఇంట్లోనే నేచురల్ హెయిర్ కండిషనర్ తయారీ.. రఫ్‌గా ఉన్న
మందార పూలతో ఇంట్లోనే నేచురల్ హెయిర్ కండిషనర్ తయారీ.. రఫ్‌గా ఉన్న
వాట్సాప్ గ్రూప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 4 కొత్త ఫీచర్లు
వాట్సాప్ గ్రూప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 4 కొత్త ఫీచర్లు
ఆ వ్యాధితో చెల్లెలి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల
ఆ వ్యాధితో చెల్లెలి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల