Jr.NTR: కెమెరా కోసమే తారక్ పుట్టారేమో.. ఎన్టీఆర్ పై శుభలేక సుధాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఎన్టీఆర్ వండర్ కిడ్ అని.. కెమెరా కోసమే ఆయన పుట్టారేమో అనిపిస్తుందని అన్నారు. వీరిద్దరు కలిసి అరవింద సమేత చిత్రంలో నటించారు.

Jr.NTR: కెమెరా కోసమే తారక్ పుట్టారేమో.. ఎన్టీఆర్ పై శుభలేక సుధాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Ntr, Subhalekha Sudhakar
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 18, 2023 | 9:28 PM

నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు తారక్. ఇక ఆయన నటన గురించి కూడా తెలిసిందే. పాత్ర కోసం తారక్ ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు. కమర్షియల్ చిత్రాలే కాదు.. పౌరాణిక సినిమాల్లోనూ ఆయన నటనపై సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తుంటారు. ఇక తారక్ తో నటించిన ప్రతి నటీనటులు ఆయన నటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. ఎన్ని పేజీల డైలాగ్ అయినా.. సింగిల్ టేక్ లో చెప్పేస్తుంటాడంటారు. అలాగే సీనియర్ నటుడు శుభలేక సుధాకర్ సైతం తారక్ నటనపై.. ఆయన డైలాగ్ డెలివరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వండర్ కిడ్ అని.. కెమెరా కోసమే ఆయన పుట్టారేమో అనిపిస్తుందని అన్నారు. వీరిద్దరు కలిసి అరవింద సమేత చిత్రంలో నటించారు.

గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శుభలేక సుధాకర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ‘ఎన్టీఆర్ నటన గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆయన ఎప్పుడు డైలాగ్ చదువుతాడో తెలియదు. సెట్ లో ఎప్పుడూ సరదాగా అందరితో నవ్వుతూ మాట్లాడుతుంటారు. కానీ టేక్ అనగానే మూడు, నాలుగు పేజీల డైలాగ్ అయినా సింగిల్ టేక్ లో చెబుతాడు. సెట్ లో ఆయన పేపర్ చూసుకోవడం నేనెప్పుడు చూడలేదు. ఆయన కెమెరా కోసమే పుట్టారనిపిస్తోంది. ఇదంతా సినిమా పట్ల ఆయనకు ఉన్న కసి, కృషి వల్లేనేమో. చెప్పాలంటే తారక్ వండర్ కిడ్’ అంటూ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు.

ప్రస్తుతం తారక్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమా NTR30 అనే వర్కింగ్ టైటిల్‏తో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?