Ram Charan : ‘నెపోటిజం’పై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నాన్న ఒక్క మాట చెప్పారు.. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా.. 

ఒక స్టార్ హీరో కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ టాలెంట్ లేకపోతే ఇక్కడ నెట్టుకు రావడం కష్టమన్నారు. ప్రతిభ ఉంటేనే ప్రేక్షకులు ప్రోత్సహిస్తారని చెప్పారు.

Ram Charan : 'నెపోటిజం'పై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నాన్న ఒక్క మాట చెప్పారు.. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా.. 
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 18, 2023 | 9:28 PM

ఆర్ఆర్ఆర్ చిత్రంతో వరల్డ్ సూపర్ స్టార్‏గా సంపాదించుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇటీవల లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న చరణ్.. శుక్రవారం ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ఇండియా టూడే నిర్వహించిన కాంక్లేవ్ 2023లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చరణ్ మాట్లాడుతూ పాన్ ఇండియా నుంచి ఆస్కార్ వరకు ట్రిపుల్ ఆర్ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ఇండస్ట్రీలో ఇటీవల ఎక్కువగా వినిపిస్తోన్న నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక స్టార్ హీరో కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ టాలెంట్ లేకపోతే ఇక్కడ నెట్టుకు రావడం కష్టమన్నారు. ప్రతిభ ఉంటేనే ప్రేక్షకులు ప్రోత్సహిస్తారని చెప్పారు.

నెపోటిజంపై చరణ్ స్పందిస్తూ.. “నిజం చెప్పాలంటే నాకు ఇప్పటికీ ఇది అర్థం కాలేదు. ఇటీవల దీని గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. బంధుప్రీతి ఉందని భావించే వాళ్ల వల్లే ఇది ఇంతటి చర్చకు దారి తీసింది. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాను. నాకు నటన అంటే ఇష్టం. సినిమానే ఊపిరిగా తీసుకుంటూ ఎంతో మంది నిర్మాతలను కలుస్తూ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. నా మనసుకు నచ్చిన పని చేయడం వల్లే నేను 14 ఏళ్లుగా ఇక్కడ నిలబడగలిగాను. మా నాన్న వల్లే సినీ పరిశ్రమలోకి వచ్చినప్పటికీ ఈ ప్రయాణాన్ని నాకు నేనుగా ముందుగా సాగించాలి. టాలెంట్ లేకపోతే ఈ ప్రయాణం సులభం కాదు.

సక్సెస్ లేదా ఫెయిల్యూర్.. నీకోసం పనిచేసేవాళ్లను జాగ్రత్తగా చూసుకో చాలు అని మొదట్లో నాన్న నాతో చెప్పిన మాటను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. ఒకవేళ ఓ స్టార్ హీరో కొడుకు అయినందున సాధారణ ప్రజలు రూ. 100, రూ. 500 పెట్టి సినిమా చూస్తారు అనుకోను ” అని చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.