Ram Charan: కోహ్లీ నాకు ఇన్‌స్పిరేషన్‌.. విరాట్‌ బయోపిక్‌లో నటించడానికి రెడీ.. మనసులో మాట చెప్పిన రామ్‌ చరణ్‌

ఆస్కార్‌ వేడుక నుంచి ఇండియా వచ్చిన చరణ్‌ ఢిల్లీలో జరిగిన ఓ ప్రైవేట్‌ ఛానల్‌ ఎన్‌క్లేవ్‌లో పాల్గొన్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో రామ్‌ చరణ్‌ తన పర్సనల్‌ లైఫ్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Ram Charan: కోహ్లీ నాకు ఇన్‌స్పిరేషన్‌.. విరాట్‌ బయోపిక్‌లో నటించడానికి రెడీ.. మనసులో మాట చెప్పిన రామ్‌ చరణ్‌
Ramcharan, Virat
Follow us
Basha Shek

|

Updated on: Mar 18, 2023 | 2:39 PM

రామ్ చరణ్.. మెగాస్టార్‌ చిరంజీవి కొడుకు ట్యాగ్‌తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. వరుస ఇండస్ట్రీ హిట్లతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిపోయాడు చెర్రీ. దీనికి ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారం కూడా రావడంతో చరణ్‌ క్రేజ్‌ ఇప్పుడు నెక్ట్స్‌ లెవెల్‌లో ఉంది. ఇదిలా ఉంటే ఆస్కార్‌ వేడుక నుంచి ఇండియా వచ్చిన చరణ్‌ ఢిల్లీలో జరిగిన ఓ ప్రైవేట్‌ ఛానల్‌ ఎన్‌క్లేవ్‌లో పాల్గొన్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో రామ్‌ చరణ్‌ తన పర్సనల్‌ లైఫ్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా తన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ గురించి ఒక క్లారిటీ ఇచ్చాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు చెర్రీ. ఆర్‌సీ 15 (వర్కింట్ టైటిల్‌) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ చాలా భాగం పూర్తయ్యింది. దీని తర్వాతి ప్రాజెక్టులపై కాన్‌ క్లేవ్‌ వేదికగా స్పందించాడు రామ్ చరణ్ . ముఖ్యంగా టీమిండియా రన్‌ మెషిన్ విరాట్ కోహ్లీ బయోపిక్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

‘ నేను కూడా చాలారోజుల నుంచి స్పోర్ట్స్ బేస్డ్ సినిమా ఒకటి తీయాలని ఎదురుచూస్తున్నాను. అవకాశం వస్తే తప్పకుండా విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తాను. ఎందుకంటే విరాట్ కోహ్లి చాలా ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీ. నాకు కూడా అతనే ఆదర్శం. విరాట్‌ బ‌యోపిక్‌లో న‌టించే చాన్స్ వ‌స్తే అసలు వదులుకోను’ అని తెలిపాడు చెర్రీ. ప్రస్తుతం చరణ్‌ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. రామ్‌ చరణ్‌ హీరోగా కోహ్లీ బయోపిక్ తెరకెక్కితే భారీ హిట్ కొట్టడం ఖాయమని ఇటు చరణ్‌ అభిమానులు, ఇటు కోహ్లీ ఫ్యాన్స్ సోషల్‌ మీడియా వేదికా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ బయోపిక్‌ తెరకెక్కించేందుకు ఏ డైరెక్టర్‌ ముందుకు వస్తారో లెట్స్‌ వెయిట్ అండ్‌ సీ..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..