- Telugu News Photo Gallery Cinema photos Bollywood Actress Janhvi Kapoor photos in black outfit goes viral
Janhvi Kapoor: బ్లాక్ డ్రెస్‌లో వైట్ డైమండ్.. కుర్ర హృదయాలను కొల్లగొడుతోన్న జాన్వీ
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే సినిమా తారల్లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఒకరు. నిత్యం తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది.
Updated on: Mar 18, 2023 | 10:23 PM

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే సినిమా తారల్లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఒకరు. నిత్యం తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది.

తాజాగా బ్లాక్ కలర్‌లో బాడీ టైట్ మిడ్‌డే డ్రెస్‌లో ఫొటోలకు పోజుల్చిందీ అందాల తార. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి ఈ ఫొటోలకు. దీనికి క్యాప్షన్ ఏమీ రాయలేదు కానీ హార్ట్ ఎమోజీని జత చేసింది జాన్వీ.

జాన్వీ ఫోటోలపై ఫ్యాన్స్ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. ఆమెను బాలీవుడ్ కిమ్ కర్దాషియాన్ అండూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం జాన్వీ కపూర్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ చిత్రానికి సంతకం చేసిందీ సొగసరి.

ఎన్టీఆర్ 30తో పాటు మిస్టర్ అండ్ మిసెస్ మహి, బావల్ చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించనుంది జాన్వీ.