AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ఆస్కార్‏తో హైదరాబాద్ చేరుకున్న ఆర్ఆర్ఆర్ టీం.. జై హింద్ అంటూ రాజమౌళి నినాదం..

ఇక ఇప్పటికే అమెరికా నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చేయగా.. ఈరోజు ఉదయం ట్రిపుల్ ఆర్ చిత్రయూనిట్ హైదరాబాద్ చేరుకుంది. ఆస్కార్ తీసుకున్నాక హైదరాబాద్ వచ్చిన రాజమౌళి త్రిపుల్ ఆర్ టీం.

RRR Movie: ఆస్కార్‏తో హైదరాబాద్ చేరుకున్న ఆర్ఆర్ఆర్ టీం.. జై హింద్ అంటూ రాజమౌళి నినాదం..
Rajamouli
Rajitha Chanti
|

Updated on: Mar 17, 2023 | 8:01 AM

Share

ప్రపంచవ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్ చిత్రం.. ఇటీవల ఆస్కార్ అవార్డ్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మార్చి 13న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్ ప్రధానోత్సవ వేడుకలకు వారం ముందే ట్రిపుల్ ఆర్ చిత్రయూనిట్ అమెరికాకు చేరుకుంది. అక్కడి మీడియాకు వరుస ఇంటర్వ్యూస్ ఇస్తూ.. ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాలు జోరుగా నిర్వహించారు జక్కన్న అండ్ టీం. సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్ అందుకుని… తెలుగు సినిమా గౌరవాన్ని మరింత పెంచారు. ఇక ఇప్పటికే అమెరికా నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చేయగా.. ఈరోజు ఉదయం ట్రిపుల్ ఆర్ చిత్రయూనిట్ హైదరాబాద్ చేరుకుంది. ఆస్కార్ తీసుకున్నాక హైదరాబాద్ వచ్చిన రాజమౌళి త్రిపుల్ ఆర్ టీం.

రాజమౌళి, కీరవాణి, కాలభైరవతో సహా మొత్తం 14 మంది టీమ్ హైదరాబాద్ చేరుకున్నారు. ట్రిపుల్ ఆర్ చిత్రయూనిట్‏కు అభిమానులు, సినీ ప్రియులు ఘన స్వాగతం పలికారు. ఈక్రమంలోనే మీడియా అడిగిన ప్రశ్నలకు కేవలం ‘జై హింద్’ అంటూ నినాదం ఇచ్చారు రాజమౌళి. రెండుసార్లు జైహింద్ అంటూ గట్టిగా అరుస్తూ వెళ్లిపోయారు రాజమౌళి.

ఇక ఇటీవల ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డ్ తనను మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ప్రేరేపిస్తుందని అన్నారు. ఆస్కార్ అవార్డ్ రావడంతో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సిక్వెల్ మరింత వేగంగా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి