AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayashanthi : ఆ వెబ్ సిరీస్ పై విజయశాంతి సీరియస్.. ఉద్యమాల వరకు తెచ్చుకోకండి అంటూ ఆగ్రహం..

ఓటీటీలో ప్రసారమయ్యే చిత్రాలు, సిరీస్ లను తప్పనిసరి చేయాలని ప్రముఖ నటి, బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఆ అంశాన్ని ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళలు సంబంధిత బోర్డు ముందుకు తీసుకొచ్చారని పేర్కొన్నారు.

Vijayashanthi : ఆ వెబ్ సిరీస్ పై విజయశాంతి సీరియస్.. ఉద్యమాల వరకు తెచ్చుకోకండి అంటూ ఆగ్రహం..
Vijayashanti
Rajitha Chanti
|

Updated on: Mar 19, 2023 | 7:28 AM

Share

ప్రస్తుతం ఓటీటీ ప్లా్ట్ ఫామ్స్‏కు వస్తోన్న ఆదరణ గురించి చెప్పక్కర్లేదు. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న పెద్ద చిత్రాలు సైతం రెండు నెలల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే టాక్ షోస్, గేమ్ షోస్ అంటూ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‏లకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే తాజాగా ఓటీటీ సెన్సార్ పై సీరియస్ అయ్యారు. ఓటీటీలో ప్రసారమయ్యే చిత్రాలు, సిరీస్ లను తప్పనిసరి చేయాలని ప్రముఖ నటి, బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఆ అంశాన్ని ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళలు సంబంధిత బోర్డు ముందుకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఓటీటీ సెన్సార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ చేశారు విజయశాంతి..

“ఈ మధ్యనే విడుదలైన ఒక తెలుగు (బహుబాషా) ఓటీటీ సిరీస్ పై.. ఓటీటీ ప్లాట్ ఫాంపై కఠినమైన సెన్సార్ అవసరం. ఓటీటీ సెన్సార్ పై ఇప్పటికే చాలా మంది ప్రజలు, ప్రత్యేకించి మహిళలు ముందుకు వస్తున్నారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందులో ప్రసారమయ్యే అసభ్యకరమైన దృశ్యాలను తొలగించి.. ప్రజా వ్యతిరేకతకు గురికాకుండా చూసుకోవాలని సంబంధిత నటీనటులు, నిర్మాతలకు కోరుతున్నాను. తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల వరకు తెచ్చుకోకుండా ఉంటారని భావిస్తున్నాను. ప్రేక్షకులు చూపించే అభిమానాన్ని కాపాడుకుంటారని అభిప్రాయపడుతున్నాను ” అని చెప్పుకొచ్చారు.

అయితే ఆ వెబ్ సిరీస్ పేరు కానీ.. అందులో నటించిన నటీనటుల పేర్లు కానీ ఆమె ప్రస్తావించలేదు. అయితే విజయశాంతి చేసిన పోస్ట్ కు నెటిజన్స్ సైతం మద్దతు తెలుపుతున్నారు. ఓటీటీకి కచ్చితంగా సెన్సార్ ఉండాలని అంటున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!