AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Nani: ‘దసరా’ చిత్రంలో కేజీఎఫ్, పుష్ప చిత్రాల ఫ్లేవర్ ఉంటుందా ?.. నాని రియాక్షన్ ఏంటంటే..

ప్రస్తుతం ఈ చిత్రప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు నాని. ఇటీవల ఈ సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొన్న నాని.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Actor Nani: 'దసరా' చిత్రంలో కేజీఎఫ్, పుష్ప చిత్రాల ఫ్లేవర్ ఉంటుందా ?.. నాని రియాక్షన్ ఏంటంటే..
Nani
Rajitha Chanti
|

Updated on: Mar 19, 2023 | 6:34 AM

Share

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం దసరా. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో శ్రీకాంత్ తెలుగు చిత్రపరిశ్రమకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా మార్చి 30న పాన్ ఇండియా లెవల్లో తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ చిత్రప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు నాని. ఇటీవల ఈ సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొన్న నాని.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ చిత్రంలోని విజువల్స్ పుష్ప, కేజీయఫ్ చిత్రాల ఫ్లేవర్ లో ఉన్నాయి.. మీ టార్గెట్ అదేనా ?.. అంటూవిలేకరి ప్రశ్నించగా.. నాని మాట్లాడుతూ.. “ఈ సినిమా విషయంలో మీరు ఏదానా ఊహించుకోండి. మాకు అలాంటి ఆలోచనే లేదు “అన్నారు. అలాగే..కొత్త దర్శకుడితో పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయడంలో ఉన్న నమ్మకమేంటనీ ప్రశ్నించగా.. “‘పుష్ప’ విడుదలకు ముందు సుకుమార్‌ తెలుగులో పెద్ద దర్శకుడు. ఆ తర్వాత అన్ని పరిశ్రమల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాంత్‌ విషయానికొస్తే.. ‘దసరా’కు ముందు తను అన్ని చిత్ర పరిశ్రమలకు కొత్తవాడు. తర్వాత తన గురించి అందరికీ తెలుస్తుంది. తనపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అయినా కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి ప్రత్యేక కారణమంటూ ఏం లేదు.

ఇవి కూడా చదవండి

అనుభవం ఉన్న దర్శకులతో పనిచేశా, కొత్తవారితోనూ పనిచేస్తుంటా. ప్రతిభ విషయంలో కొత్త, పాత తేడా ఉండదు. 2008లో నా విషయంలోనూ ఇలా ‘కొత్త’ అనుకుని ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉండేవాణ్ని కాదు కదా.” అంటూ చెప్పుకొచ్చారు.

Follow Us
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!