AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentines Week: భార్య కోసం ప్రేమని వదులుకుని.. వ్యసనాలకు బానిసగా మారి 39 ఏళ్లకే మరణించిన లెజెండ్ గురుదత్ విషాద ప్రేమ కథ మీకు తెలుసా..

తెలుగు రాష్ట్రానికి చెందిన వహీదా రెహ్మాన్ దక్షిణాది సినిమాల్లో నటిస్తూ అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటుంది. ఈ సమయంలో బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు గురుదత్ దృష్టిలో పడింది వహీదా రెహ్మాన్‌. ఆమెను చూసిన మొదటిసారే.. అందానికి ఫిదా.. బాలీవుడ్ లోకి తీసుకుని వెళ్లాలని గురుదత్  నిర్ణయించుకున్నాడు.

Valentines Week: భార్య కోసం ప్రేమని వదులుకుని.. వ్యసనాలకు బానిసగా మారి 39 ఏళ్లకే మరణించిన లెజెండ్ గురుదత్ విషాద ప్రేమ కథ మీకు తెలుసా..
Guru Dutt Waheeda Rehman
Surya Kala
|

Updated on: Feb 09, 2023 | 12:24 PM

Share

మరికొన్ని రోజుల్లో ప్రేమికుల రోజుని జరుపుకోవడనికి ప్రేమికులు రెడీ అవుతున్నారు. వాలంటైన్ వీక్ లో భాగంగా రోజుకో విధంగా తమ ప్రేమని తమ భాగస్వామికి తెలియజేస్తున్నారు. అయితే ప్రేమికుల వారోత్సవాల్లో భాగంగా.. సినిమా ప్రపంచంలో విషాద ప్రేమ కథలను గురించి తెలుసుకుంటున్నాం.. అలాంటి ప్రేమ కథల్లో ఒకటి బాలీవుడ్ లెజెండ్ దర్శక నిర్మాత గురుదత్, ప్రముఖ నటి వహీదా రెహ్మాన్ ల ప్రేమ కథ. గురుదత్ వహీదా రెహ్మాన్‌ను అత్యంత గాఢంగా ప్రేమించారు.. అయితే వీరి ప్రేమ కథ అసంపూర్తిగా మిగిలిపోయింది.  వాలెంటైన్స్ వీక్ లో భాగంగా ఈ రోజు గురుదత్, వహీదా రెహ్మాన్ ల అమర ప్రేమ గురించి తెలుసుకుందాం..

ఎలా ప్రేమ మొదలైందంటే..

తెలుగు రాష్ట్రానికి చెందిన వహీదా రెహ్మాన్ దక్షిణాది సినిమాల్లో నటిస్తూ అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటుంది. ఈ సమయంలో బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు గురుదత్ దృష్టిలో పడింది వహీదా రెహ్మాన్‌. ఆమెను చూసిన మొదటిసారే.. అందానికి ఫిదా.. బాలీవుడ్ లోకి తీసుకుని వెళ్లాలని గురుదత్  నిర్ణయించుకున్నాడు. గురుదత్ అప్పట్లో CID అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. అప్పుడు ఈ చిత్రంలో నటించమని వహీదా రెహ్మాన్‌కి ఆఫర్ చేశాడు.. స్క్రీన్ టెస్ట్ కోసం పిలిచాడు.. అలా సీఐడీ సినిమాకి సంతకం చేసిన వహీదా హిందీ చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఒకరికొకరు దగ్గరయ్యారని టాక్ అప్పట్లో వినిపించేది. కాల క్రమంలో గురుదత్ పూర్తిగా వహీదా రెహమాన్‌తో ప్రేమలో పడ్డాడు. అనంతరం ‘ప్యాసా’ సినిమాలో వహీదా రెహమాన్ సరసన హీరోగా కనిపించాడు. 1957లో  రిలీజైన  ‘ప్యాసా’ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టాడు. తానే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు కూడా. అయితే వాస్తవానికి ఈ సినిమాలో హీరోగా దిలీప్ కుమార్‌ అని భావించారట.. అయితే హీరోయిన్ గా వహీదా రెహ్మాన్ అని తెలియడంతో.. దిలీప్ కుమార్‌కి బదులుగా తానే ఈ సినిమాలో హీరోగా నటించానని చెప్పారు గురు దత్.

అప్పటికే పెళ్లయిన గురుదత్‌

వహీదా రెహ్మాన్ అందానికి గురుదత్ ప్రేమలో పడ్డాడు. అయితే ఈ ప్రేమకథలో సమస్య ఏమిటంటే అతనికి అప్పటికే పెళ్లయింది. గురుదత్ 1953లో గాయని గీతాదత్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ‘ప్యాసా’ సినిమా సెట్స్‌పైనే వీరిద్దరి ప్రేమ ప్రపంచం ముందుకు రావడం మొదలైంది. ఒకానొక సమయంలో గురుదత్, వహీదా రెహమాన్ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తతో గీత తీవ్రంగా విరుచుకుపడింది. అనంతరం తన భర్త గురుదత్‌కు దూరమై తన బిడ్డతో విడిగా జీవించడం ప్రారంభించింది.

గురుదత్ తన కుటుంబం దూరం అవ్వడంతో ఆ బాధను తట్టుకోలేకపోయాడు. అతని ముందు రెండు మార్గాలు ఉన్నాయి. మొదట,  తన ప్రేమను అంటే వహీదా రెహ్మాన్ విడిచి పెట్టి భార్యా కొడుకుని ఎంచుకోవడం.. రెండవది.. మొదటి భార్యని వదిలి.. రెండవ భార్యగా వహీదాను పెళ్లి చేసుకోవడం.. అయితే గురుదత్ ప్రేమ భార్యలో భార్యను ఎంచుకున్నాడు. గీత ఇంటికి తిరిగి వచ్చింది. అనంతరం  గురుదత్ వహీదా రెహ్మాన్ నుండి దూరం కావడం ప్రారంభించాడు.

39 ఏళ్ల వయసులో ప్రపంచాన్ని విడిచి పెట్టిన గురుదత్

గురుదత్ తన భార్య కోసం తన వహీదాని విడిచిపెట్టాడు. అయితే ప్రేమని మరచిపోలేక పోయాడు. దీంతో గురుదత్ చాలా రోజులు  నిద్రపోలేదని సన్నిహితులు చెప్పేవారు. కాలక్రమంలో సిగరెట్ తాగడం, మద్యం తాగడం, నిద్రమాత్రలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆపై కేవలం 39 ఏళ్ల వయసులో ఒకరోజు ప్రపంచానికి వీడ్కోలు పలికాడు. అతిగా నిద్రమాత్రలు తీసుకోవడం, మద్యం సేవించడమే గురుదత్ మరణానికి కారణమని వైద్యులు తెలిపారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us