AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Selfiee Movie: మై ఖిలాడీ తూ అనాడీ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన అక్కీ, సల్మాన్.. వీడియో వైరల్

అక్షయ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశాడు. అక్కీతో పాటు సల్మాన్ ఖాన్ కూడా వీడియోలో కనిపిస్తున్నారు. వీడియో ప్రారంభంలో.. అక్షయ్ కుమార్యొ ఈ సాంగ్ కి సంబందించిన వీడియోను సల్మాన్‌కి చూపుతున్నాడు.

Selfiee Movie: మై ఖిలాడీ తూ అనాడీ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన అక్కీ, సల్మాన్.. వీడియో వైరల్
Selfiee Song
Surya Kala
|

Updated on: Feb 05, 2023 | 1:16 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన కొత్త చిత్రం ‘సెల్ఫీ’ ప్రమోషన్ లో బిజీబిజీగా ఉన్నాడు. రకరాల సెల్ఫీలతో అక్షయ్ కుమార్ తన సరికొత్త చిత్రాన్ని నిరంతరం ప్రమోట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. 1994లో వచ్చిన అక్షయ్ కుమార్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘మై ఖిలాడీ తూ అనాడీ’ సినిమా  టైటిల్ ట్రాక్ అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

మై ఖిలాడీ తూ అనాడీ.. పాటను అక్షయ్ కుమార్ చిత్రం సెల్ఫీలో రీక్రియేట్ చేశారు. ఈ సాంగ్ లో ఇమ్రాన్, అక్షయ్ బ్యాంగ్ డ్యాన్స్ చేశారు. ఇటీవల ఈ పాటను విడుదల చేశారు. కాగా, అక్షయ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశాడు. అక్కీతో పాటు సల్మాన్ ఖాన్ కూడా వీడియోలో కనిపిస్తున్నారు. వీడియో ప్రారంభంలో.. అక్షయ్ కుమార్యొ ఈ సాంగ్ కి సంబందించిన వీడియోను సల్మాన్‌కి చూపుతున్నాడు.. ఆ వీడియో చూస్తూ సల్మాన్, అక్కీ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అక్షయ్ కుమార్ షేర్ చేసిన వీడియో:

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

అంతేకాదు.. వెంటనే అక్షయ్ ,సల్మాన్ లేచి నిలబడి ‘మై ఖిలాడీ తూ అనాడీ’ సాంగ్ కు  డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. అక్కీ మొదట సల్మాన్‌కి పాటకి సంబంధించిన డ్యాన్స్ స్టెప్పులను చెచూపిస్తున్నాడు. ఆ స్టెప్స్ ను సల్మాన్ అనుకరించాడు. అనంతరం  ఇద్దరు సూపర్‌స్టార్‌లు కలిసి మై ఖిలాడీ తూ అనాడీ సాంగ్ కు ఓ రేంజ్ లో డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చాలా కాలం తర్వాత వీళ్లిద్దరు కలిసి కనిపించడంతో అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. అంతేకాదు మరోసారి ఈ జంట ఒకే సినిమాలో నటించాలానే కోరికను వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియోను షేర్ చేసిన అక్షయ్ కుమార్.. నేను సాంగ్ బీట్ ను సల్మాన్ ఖాన్ ను వివరించడానికి కేవలం కొన్ని సెకన్లు మాత్రమే పట్టింది. అంతే కొన్ని సెకన్లలో బీట్ ని పట్టుకుని సల్లూ బాయ్ ధూమ్ మచాయ్ చేశాడు అని క్యాప్షన్ ఇచ్చాడు. సెల్ఫీలో అక్షయ్,  ఇమ్రాన్‌లతో పాటు డయానా పెంటీ , నుష్రత్ భరూచా కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ‘సెల్ఫీ’ చిత్రం ఫిబ్రవరి 24, 2023న బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంట్లో అమ్మాయి.. చెట్టుకు అబ్బాయి.. తండ్రి సమాధిపై రక్తంతో పేర్లు
ఇంట్లో అమ్మాయి.. చెట్టుకు అబ్బాయి.. తండ్రి సమాధిపై రక్తంతో పేర్లు
చాణక్య నీతి : కోట్లు ఇచ్చినా ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోకండి
చాణక్య నీతి : కోట్లు ఇచ్చినా ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోకండి
వాస్తు టిప్స్ : ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? లాభ, నష్టాలు తెలుసుకోండి
వాస్తు టిప్స్ : ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? లాభ, నష్టాలు తెలుసుకోండి
50 ఏళ్ల నాన్నకు కూతురు డ్రీమ్ గిఫ్ట్.. ఆనందంతో తండ్రి కన్నీళ్లు
50 ఏళ్ల నాన్నకు కూతురు డ్రీమ్ గిఫ్ట్.. ఆనందంతో తండ్రి కన్నీళ్లు
సీక్రెట్ చిట్కాలతో పురానీ ఢిల్లీ స్పెషల్ 'మటన్ పాయా'..
సీక్రెట్ చిట్కాలతో పురానీ ఢిల్లీ స్పెషల్ 'మటన్ పాయా'..
గుడ్లు, పాలు తాగినా రాని శక్తి వీటితో సొంతం.. సూపర్ ఫుడ్ ఇదే
గుడ్లు, పాలు తాగినా రాని శక్తి వీటితో సొంతం.. సూపర్ ఫుడ్ ఇదే
థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్న సినిమా..
థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్న సినిమా..
చాతుర్మాసంలో కొత్త ఇల్లు కొనొచ్చా? గృహప్రవేశం చేయవచ్చా?..
చాతుర్మాసంలో కొత్త ఇల్లు కొనొచ్చా? గృహప్రవేశం చేయవచ్చా?..
రాశ్యాధిపతి బలంతో వారి జాతకం మారబోతోంది.. ఇక పట్టిందల్లా బంగారమే!
రాశ్యాధిపతి బలంతో వారి జాతకం మారబోతోంది.. ఇక పట్టిందల్లా బంగారమే!
వామ్మో రష్యాలో అంత రేటా.. అరటిపండ్లు, వాటర్ బాటిల్ ధర తెలిస్తే..
వామ్మో రష్యాలో అంత రేటా.. అరటిపండ్లు, వాటర్ బాటిల్ ధర తెలిస్తే..