Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేరు తెచ్చిన తిప్పలు.. నా పాట నేనే పాడలేకపోతున్నా.. ఇంగ్లిష్ రాని నాతో సంతకం చేయించుకుని కంపెనీ మోసం చేసిందంటూ కచ్చా బాదం సింగర్ ఆవేదన

యూట్యూబ్‌లో తన పాటను షేర్ చేసినందుకు ఒక కంపెనీ రూ.3 లక్షలు ఇచ్చారు. అయితే ఇందుకోసం సదరు కంపెనీ తనను కొన్ని పేపర్స్ మీద సంతకం పెట్టమని చెప్పారు. ఆ పేపర్ చాలా గజిబిజిగా ఉంది..

పేరు తెచ్చిన తిప్పలు.. నా పాట నేనే పాడలేకపోతున్నా.. ఇంగ్లిష్ రాని నాతో సంతకం చేయించుకుని కంపెనీ మోసం చేసిందంటూ కచ్చా బాదం సింగర్ ఆవేదన
Kacha Badam Fame Bhuban Badyakar
Follow us
Surya Kala

|

Updated on: Mar 05, 2023 | 10:35 AM

కాలం కలిసి వస్తే అదృష్టం అందలం ఎక్కిస్తోంది.. బండ్లు ఓడలవుతాయన్న సామెత అందరికీ తెలిసిందే.. ఎవరు ఎప్పుడు పెద్ద స్టార్ అవుతారో చెప్పలేం. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత రోడ్డుమీద వ్యాపారం చేసుకునే వ్యక్తి కూడా హఠాత్తుగా సెలబ్రెటీ అయిపోతున్నాడు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు వేరుశనగలు అమ్మే వ్యక్తి.. అవును కచ్చా బాదం పాటతో  ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన సింగర్ భుబన్ బద్యాకర్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడట. వివరాల్లోకి వెళ్తే..

సైకిల్ మీద తిరుగుతూ కచ్చా బాదం పాట పాడుతున్న వీడియో నేటికీ వైరల్ అవుతూనే ఉంది. ఆ సాంగ్ ను మళ్లీ మళ్ళీ వింటూ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అయితే తాను మోసపోయానని.. ఇప్పుడు తన సాంగ్ ను తాను సొంతంగా పాడలేక పోతున్నా అంటూ భుబన్ బద్యాకర్ వాపోతున్నాడు. కాపీరైట్ విషయంలో తాను మోసపోయానని సింగర్ చెబుతున్నాడు.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్‌లో తన పాటను షేర్ చేసినందుకు ఒక కంపెనీ రూ.3 లక్షలు ఇచ్చారు. అయితే ఇందుకోసం సదరు కంపెనీ తనను కొన్ని పేపర్స్ మీద సంతకం పెట్టమని చెప్పారు. ఆ పేపర్ చాలా గజిబిజిగా ఉంది.. ఇలా సంతకం పెడితే తాను భవిష్యత్ లో ఇబ్బందులు వస్తాయని తనకు తెలియదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చదువుకోలేదు.. ఇంగ్లీష్ చదవడం కూడా తెలియదని చెప్పాడు. అయితే ఆ సంస్థ నా పాట కొనుక్కున్నట్లు చెబుతోంది. మాట్లాడడం కూడా మానేసింది. తాను కాపీరైట్ సమస్య కారణంగా.. తన పాటలను తాను పాడలేను లేదా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయలేను.. ఇలా ఎంతకాలం ఉండాలో తెలియదంటూ చెప్పాడు.

సొంత ఇల్లు వదిలి వెళ్లిన భుబన్

ప్రస్తుతం భుబన్ తన గ్రామాన్ని.. సొంత ఇంటిని వదిలి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. భుబన్ పాట హిట్ కావడంతో బంధువులు దగ్గరకు చేశారు. గ్రామంలోని బంధువులు అతడిని డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించారు. పదే పదే ఫోన్ కాల్స్ చేసి బెదిరించేవారు. దీంతో భుబన్ తన గ్రామాన్ని విడిచిపెట్టి.. తన కుటుంబంతో కలిసి నగరానికి చేరుకున్నాడు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..