Anantapur: తక్కువ ధరకే బంగారం అని ఆశపడ్డ మహిళ.. లక్షలు ఎత్తుకెళ్లిన దొంగల ముఠా
హైదరాబాద్‌కు చెందిన దీపికకు తిరుపతిలో ఏడాది క్రితం ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. 20 రోజుల క్రితం దీపికకు ఫోన్ చేసిన అతను తన దగ్గర తక్కువ ధరకు వచ్చే బంగారు నాణేలు ఉన్నాయని ఆశచూపాడు.
బంగారం అంటేనే ఆడవాళ్లకు అత్యంత ఇష్టం.. రోజు రోజుకీ బంగారం ధర కొండెక్కుతున్నా ఎక్కడా నగల కొనుగోళ్లపై ప్రభావం చూపడం లేదంటే అతిశయోక్తి కాదు.. మరి అలాంటిది బంగారం తక్కువ ధరకు ఇస్తామంటే ఇక ఆలోచిస్తారు.. ఎగబడి మరీ కొనడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి ఆశనే కొందరు వ్యక్తు అవకాశంగా తీసుకుని తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లాలో తక్కువ రేటుకు బంగారు నాణేలు ఇస్తామని మోసగించి రెండు లక్షల రూపాయలు ఎత్తుకెళ్లింది దొంగల ముఠా. పెద్దవడుగూరు మండలం కాశేపల్లి టోల్ ప్లాజా దగ్గర హైదరాబాద్‌కు చెందిన దీపికకు తిరుపతిలో ఏడాది క్రితం ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. 20 రోజుల క్రితం దీపికకు ఫోన్ చేసిన అతను తన దగ్గర తక్కువ ధరకు వచ్చే బంగారు నాణేలు ఉన్నాయని ఆశచూపాడు. కర్ణాటక హోస్పేటకు వెళ్లి రెండు బంగారు నాణేలు కొనుగోలు చేసి పరీక్షించింది దీపిక. అవి గోల్డ్‌వని తేలడంతో వెంట తీసుకువెళ్లింది. 3 రోజుల క్రితం అదే వ్యక్తి మరోసారి ఫోన్ చేశాడు. తన దగ్గర ఉన్న 200 బంగారు నాణేలను 2 లక్షల రూపాయలకు విక్రయిస్తానని చెప్పాడు.
వీటిని కొనుగోలు చేసేందుకు కాశేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు వచ్చింది దీపిక. అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు నాణేలను ఆమెకు ఇచ్చి 2 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ కాయిన్స్‌ను పరీక్షించేందుకు దీపిక ప్రయత్నించగా పోలీసులు వస్తున్నట్లు కేకలు వేస్తూ దుండగులు పరారయ్యారు. దీపిక అక్కడే నాణేలను పరీక్షించగా అందులో రెండు మాత్రమే ఒరిజినల్, మిగిలినవి నకిలీ నాణేలుగా తేలింది. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతపురం జిల్లాలో దొంగ నాణేల ముఠా సంచరిస్తుంది. ఎవరైన మాయమాటలు చెబితే నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..