Sri Rama Navami: నిజాంపేట నారాయణ రెడ్డి కాలనీలో వైభవంగా రాములోరి వివాహం
తెలుగు రాష్ట్రాలు రామనామ జపంతో ప్రతిధ్వనించాయి. శోభాయాత్రలు.. సీతారాముల కళ్యాణ ఉత్సవాలతో రామాలయాలు కొత్త అందాలు సంతరించుకున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణ వైభోగాన్ని భక్తులు భక్తితో వీక్షించి..
తెలుగు రాష్ట్రాలు రామనామ జపంతో ప్రతిధ్వనించాయి. శోభాయాత్రలు.. సీతారాముల కళ్యాణ ఉత్సవాలతో రామాలయాలు కొత్త అందాలు సంతరించుకున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణ వైభోగాన్ని భక్తులు భక్తితో వీక్షించి తరించారు. తెలుగురాష్ట్రాల్లో రాములోరి కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఏపీ, తెలంగాణలోని ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. కల్యాణోత్సవం అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. అలాగే హైదరాబాద్‌లోని నిజాంపేటలోని కొలను నారాయణ రెడ్డి కాలనీలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాములోరి కళ్యాణాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, కాలనీ వాసులు వచ్చారు. కళ్యాణం అనంతరం విగ్రహాలతో శోభయాత్రను నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాలను అందంగా విద్యుద్దీపాలు, పూలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో భారీ ఎత్తున శ్రీరాముడి శోభయాత్రను నిర్వహించారు. వేలాది మంది భక్తుల మధ్య ఈ శోభయాత్ర కొనసాగింది. ఎలాంటి ఆవాంఛీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సుమారు1500మంది పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ మంగళ్‌హట్‌లోని సీతారాంబాగ్ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర రాత్రి 7 గంటలకు కోఠిలోని హనుమాన్ వ్యాయామశాలకు చేరుకోనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా సీనియర్ పోలీసు అధికారులు ఊరేగింపును పర్యవేక్షిస్తున్నారు. సున్నితమైన ప్రదేశాలలో, పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిఘా డ్రోన్ కెమెరాల సహాయంతో ఊరేగింపును పర్యవేక్షిస్తుంది. అదనంగా, IT సెల్ సోషల్ మీడియా బృందం, స్మాష్ బృందం శాంతియుత వాతావరణానికి భంగం కలగకుండా చూసేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిఘా ఉంచుతుంది.
మరిన్ని రామనవమి వేడుకల కోసం ఇక్కడ క్లిక్ చేయండి