AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Raja Singh: శ్రీరామనవవి రోజున ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు షాక్‌.. ముంబైలో కేసు నమోదు.. కారణమిదే

బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబైలో కేసు నమోదయ్యింది. జనవరి 29న జరిగిన సభలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్టు రాజాసింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. ఐపీసీ సెక్షన్‌ 153 1(ఏ ) కింద రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. హిందూ సంఘాల సమావేశంలో...

MLA Raja Singh:  శ్రీరామనవవి రోజున ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు షాక్‌.. ముంబైలో కేసు నమోదు.. కారణమిదే
Mla Raja Singh
Basha Shek
|

Updated on: Mar 30, 2023 | 3:19 PM

Share

బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబైలో కేసు నమోదయ్యింది. జనవరి 29న జరిగిన సభలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్టు రాజాసింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. ఐపీసీ సెక్షన్‌ 153 1(ఏ ) కింద రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. హిందూ సంఘాల సమావేశంలో రాజాసింగ్‌ ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే వ్యవహారంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. విద్వేషపూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించిందని వ్యాఖ్యానించింది. ఇది జరిగిన మరుసటి రోజే ముంబైలో రాజాసింగ్‌పై కేసు నమోదయ్యింది. కాగా ముంబైలో తనపై నమోదైన కేసుపై స్పందించారు రాజాసింగ్‌. ముంబై సభలో తాను లవ్‌జిహాద్‌, గోహత్యలపై మాట్లాడినట్టు చెప్పారు. మహారాష్ట్రలో కరుడుగట్టిన హిందుత్వవాది సీఎంగా ఉన్నారని , ఈ విషయంపై తాను ఆయనతో మాట్లాడతానని తెలిపారు.

నన్ను టార్గెట్‌ చేశారు..

మరోవైపు శ్రీరామనవమి వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో జరిగే శ్రీరామ శోభాయాత్రలో పాల్గొంటున్నారు రాజాసింగ్‌. అయితే ఈ వేడుకలకు ముందు ఆయన ఓ లేఖను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా తనను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. మార్చి 31న సర్థార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, హైదరాబాద్‌లోని బిజెపి కార్యాలయం, శ్రీరామ శోభాయాత్రపై బాంబులు విసిరేందుకు ఓ ఉగ్రవాది ప్లాన్ చేశాడంటూ హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వ్యక్తి సీపీకి రాసిన లేఖను రాజాసింగ్ షేర్‌ చేశారు. శ్రీరామ శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నందున తమకు సమాచారం ఇవ్వాలని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..