AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశుల వారు అనవసర పరిచయాలకు దూరంగా ఉంటే బెటర్‌.. శుక్రవారం రాశి ఫలాలపై ఓ లుక్కేయండి.

తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి శుక్రవారం (మార్చి 31) దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Horoscope Today: ఈ రాశుల వారు అనవసర పరిచయాలకు దూరంగా ఉంటే బెటర్‌.. శుక్రవారం రాశి ఫలాలపై ఓ లుక్కేయండి.
Horoscope
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 31, 2023 | 4:03 PM

Share

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):

ఉద్యోగ విధులు అనుకూలంగా సాగిపోతాయి. బాగా ఒత్తిడి పెరిగినప్పటికీ ముఖ్యమైన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి.. ప్రయోజనం లేని పనులను నె త్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ అందుకు సమానంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఆలోచన చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):

కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పు కనిపిస్తుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. దూర ప్రాంతంలో ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):

విదేశాల్లో ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. కొందరు మిత్రులు అండగా నిలబడి ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. బంధువులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న బాకీ ఒకటి వసూలు అవుతుంది. పిల్లలు చదువుల్లో అభివృద్ధి సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. స్నేహితురాలికి విందు ఏర్పాటు చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):

ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు ఎంతో ఉదారంగా సహాయం చేస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. బందు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది.విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఐటీ వారు మంచి ఉద్యోగాల్లోకి మారటానికి అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):

అధికారులు మీ ప్రతిభను గుర్తించి అదనపు బాధ్యతలను అప్పగిస్తారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. రియల్ ఎస్టేట్, ఐటీ రంగాలకు చెందినవారు బిజీ అయిపోతారు. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. బంధువులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి.. స్నేహితురాలి మీద బాగా ఖర్చవుతుంది. ఇతరులకు బాగా ప్రయోజనం కలిగించే పనులు చేస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):

ఆర్థిక విషయాలలో సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎదిగే సూచనలు ఉన్నాయి. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐటి వంటి వృత్తి నిపుణులు బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. సామాజిక రంగంలోని వారికి గౌరవ మర్యాద పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శుభవార్తలు వింటారు. స్నేహితుల కారణంగా కొద్దిగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):

పిల్లల పురోగతికి సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అయితే, తనకు మాలిన ధర్మంగా ఇతరులకు భారీగా సహాయం చేస్తారు. పెళ్లికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ పరంగా దూరప్రాంతం నుంచి మంచి సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన విధంగా మంచి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ):

ఉద్యోగంలో చిన్నాచితకా సమస్యలున్నా సకాలంలో బాధ్యతలు పూర్తి చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. పిల్లలు చదువుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది. ఆహార విహారాల్లో క్రమశిక్షణ అవసరం. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. సాయం పొందిన స్నేహితులు ముఖం చాటేస్తారు. నిరుద్యోగులకు ఆఫర్లు వస్తాయి. స్నేహితురాలితో కలిసి వినోద యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):

ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. కొద్దిగా రుణ సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో నాయకత్వ బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు ఆశించిన దాని కంటే ఎక్కువగా అభివృద్ధి సాధిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి సమయం అనుకూలంగా ఉంది. అపార్ధాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పిల్లలకు సంబంధించిన సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):

ఉద్యోగ జీవితం ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు చక్కబడుతుంది. ఒక ప్రధానమైన రుణ సమస్య నుంచి అనుకోకుండా బయటపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు శక్తికి మించి సహాయం చేస్తారు. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి నిపుణులు తమ రంగంలో కొత్త పుంతలు తొక్కుతారు. హామీలు ఉండటం, వాగ్దానాలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):

ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగి ఇబ్బంది పడతారు. కొన్ని వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా సానుకూలంగా పరిష్కారం అవుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. స్నేహితుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):

కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆచితూచి ఖర్చు చేయడం ప్రారంభిస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా సకాలంలో బాధ్యతలు పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. డాక్టర్లకు, లాయర్లకు క్షణం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఐటీ రంగం వారికి మంచి కంపెనీల నుంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులు గుర్తింపు తెచ్చుకుంటారు.

మరిన్ని జ్యోత్యిష్య వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us