Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: మొదట ఇంటింటికీ పాలు పంపిణీ.. మిల్క్‌బాస్కెట్‌తో కోట్ల విలువైన కంపెనీకి నేడు యజమాని

మిల్క్‌బాస్కెట్ వ్యవస్థాపక బృందం మొదట్లో తమ సొంత కారులో పాలను పంపిణీ చేసేవారు. డిమాండ్ పెరగడంతో.. ఆటోరిక్షాను అద్దెకు తీసుకున్నారు. మిల్క్‌బాస్కెట్ కార్పొరేట్లు, ఆటోమోటివ్ కంపెనీలతో భాగస్వామ్యం అయ్యాక ఆర్డర్ వాల్యూమ్‌లు పెరిగాయి.

Success Story: మొదట ఇంటింటికీ పాలు పంపిణీ.. మిల్క్‌బాస్కెట్‌తో కోట్ల విలువైన కంపెనీకి నేడు యజమాని
Milkbasket App
Follow us
Surya Kala

|

Updated on: Mar 31, 2023 | 1:07 PM

నేటి మానవుడు మారుతున్న కాలంతో పోటీపడుతూ పరుగులు పెడుతూ జీవించాల్సి వస్తుంది. దీంతో ప్రతి ఒక్కరూ హోమ్ డెలివరీ సేవలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఆహార పదార్ధాల నుంచి, ధరించే దుస్తులు, ఇలా ఒకటేమిటి.. తమకు కావాల్సిన వాటికోసం ఆన్ లైన్ మీద ఆధారపడుతున్నారు. పాలు, కిరాణా, గుడ్లు మొదలైనవాటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. గత కొంతకాలంగా భారత మార్కెట్‌లో ఈ ట్రెండ్ గణనీయంగా పెరిగింది. కస్టమర్ల పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అనేక స్టార్టప్‌లు పుట్టుకొస్తున్నాయి..  ఈ వ్యాపారం ప్రారంభిస్తూ సక్సెస్ ను అందుకుంటున్నారు.

తాజా పాలను సరఫరా చేయాలనే లక్ష్యంతో ఒక స్టార్టప్ ఒకటి ప్రస్తుతం వినియోగదారులను ఆకట్టుకుంది. ఈ స్టార్టప్ పేరు మిల్క్‌బాస్కెట్. ఇది సబ్‌స్క్రిప్షన్ ఆధారిత మైక్రో-డెలివరీ సేవ.. ప్రతి రోజూ ఉదయం వినియోగదారులకు డెయిరీ, గృహావసరాలకు సంబంధించిన నిత్యావసరాలను అందిస్తుంది.

ఎలా స్ఫూర్తి పొందారంటే? 

ఇవి కూడా చదవండి

ఈ కంపెనీని 2015 సంవత్సరంలో అనంత్ గోయల్, అనురాగ్ జైన్, ఆశిష్ గోయల్, యతీష్ తలావాడియా కలిసి ప్రారంభించారు. కంపెనీ వ్యవస్థాపకుడు ఆశిష్ గోయల్ UK లో ఉన్నప్పుడు.. అతను తన ఇంటి అవసరాల కోసం కిరాణా, రోజువారీ అవసరాల వస్తువుల  డెలివరీ చేయడానికి ‘మిల్క్ అండ్ మోర్’ కంపెనీ సేవను తీసుకున్నాడు. అదే సమయంలో భారతదేశంలో కూడా ఇలాంటి సేవ ప్రారంభిస్తే అని ఆశిష్ ఆలోచించాడు.

మిల్క్‌బాస్కెట్ ఈ ఆలోచనల నుంచి పుట్టిందే.. దీనిని ప్రారంభించినప్పుడు.. వ్యవస్థాపకులు మొదట గురుగ్రామ్‌లోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. కస్టమర్‌లు పోటెత్తడం ప్రారంభించారు. ఆ తర్వాత యాప్‌ను రూపొందించారు.

స్వయంగా తాజా పాలను పంపిణీ చేసిన వ్యవస్థాపకులు 

మిల్క్‌బాస్కెట్ వ్యవస్థాపక బృందం మొదట్లో తమ సొంత కారులో పాలను పంపిణీ చేసేవారు. డిమాండ్ పెరగడంతో.. ఆటోరిక్షాను అద్దెకు తీసుకున్నారు. మిల్క్‌బాస్కెట్ కార్పొరేట్లు, ఆటోమోటివ్ కంపెనీలతో భాగస్వామ్యం అయ్యాక ఆర్డర్ వాల్యూమ్‌లు పెరిగాయి.

కంపెనీ ఎలా పని చేస్తుందంటే.. 

మిల్క్‌బాస్కెట్ అనేది గురుగ్రామ్-ఆధారిత సంస్థ. వినియోగదారుల రోజువారీ గృహ అవసరాలను తీర్చడానికి ఆన్‌లైన్ కిరాణా నెట్‌వర్క్‌ను నిర్మించింది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉంది. నిర్వహించబడుతుంది. ఈ కంపెనీ చాలా సులభమైన డెలివరీ వ్యవస్థను కలిగి ఉంది. పాలు, రొట్టె, గుడ్లు, వెన్న, జ్యూస్‌లు సహా ఇతర రోజువారీ అవసరాలు.. ప్రాథమిక వస్తువులను ప్రతిరోజూ ఉదయం తన వినియోగదారులకు ఇంటి దగ్గరే అందిస్తుంది.

COVID సమయంలో అభివృద్ధి కోవిడ్ -19 మహమ్మారి సమయంలో.. చాలా మంది ప్రజలు ఇంట్లో ఉన్నారు. కనీస అవసరాల వస్తువుల కోసం కనీసం మార్కెట్ కు కూడా వెళ్లలేకపోయారు. దీంతో చాలా ఆన్‌లైన్ కంపెనీలపై ఆధారపడ్డారు. ఈ ఆన్ లైన సేవలు సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించాయని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సమయంలో ఈ కంపెనీలు చాలా లాభాలను పొందాయనడంలో ఆశ్చర్యం లేదు.

అదే సమయంలో మిల్క్‌బాస్కెట్ ఆన్‌లైన్ గ్రోసరీకి కూడా అవకాశం లభించింది. భారతదేశంలో ఆన్‌లైన్ కిరాణా మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుందని కంపెనీ అప్పటికే అంచనా వేయడంతో.. మిల్క్‌మార్కెట్‌ వైపు దృష్టి సారించింది.

పెరిగిన ఆదాయం  మిల్క్‌బాస్కెట్ ఆదాయం 2020లో 3.8 రెట్లు పెరిగి రూ. 322 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. కంపెనీ వ్యవస్థాపకులలో ఒకరైన అనంత్ గోయల్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి  చెందిన సమయంలో దుకాణదారులలో హోమ్ డెలివరీ సేవలను  విస్తృతం చేశారు. కస్టమర్స్ నుంచి వస్తువుల డెలివరీల ను స్వీకరిస్తూ.. మార్కెట్ ను విస్తరించేలా చేశారు. దీంతో తమ సంస్థ మార్కెటింగ్ ఒక సంవత్సరంలో వేగంగా అభివృద్ధి చెందింది.

ఇతర సంస్థలతో ఎదురైన సవాళ్లు అయితే, మిల్క్‌బాస్కెట్‌కి కూడా మార్కెట్‌లో మంచి ఆదరణ ఉండటంతో సూపర్ డైరీ, డైలీ నింజా, టౌన్ ఎస్సెన్షియల్స్, బిగ్ బాస్కెట్, డన్జో, జొమాటో, స్విగ్గి వంటి ఆన్ లైన్ కంపెనీల నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. అయితే ఈ సంస్థల ప్రభావం తమ సంస్థపై పడలేదని..  మార్కెట్‌లో ఎలాంటి తేడా లేకుండా తమ కస్టమర్స్  మిల్క్‌బాస్కెట్ ను ఆదరిస్తూనే ఉన్నారని యజమానులు నమ్ముతున్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..