Ambulance Accident: మద్యం మత్తులో అంబులెన్స్ నడిపి బైక్‌ను ఢీ కొట్టిన డ్రైవర్.. మహిళ మృతి.. ముగ్గురికి గాయాలు
ఈ ప్రమాదంలో మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు కూడా గాయపడ్డారు. ఆసుపత్రి అంబులెన్స్‌ను నడుపుతున్నప్పుడు డ్రైవర్ పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడు.
ఎవరి ప్రాణాలకైనా కాపాడడం కోసం అత్యవసర పరిస్థితులు ఎదురైతే.. అంబులెన్స్ ను ఆశ్రయిస్తారు. అయితే ఆ అంబులెన్స్ డ్రైవర్ మద్యం మత్తులో మునిగితే .. తప్పతాగి ప్రాణాలను కాపాడడం కోసం ఉపయోగించే వాహనంతో ప్రాణాలను హరించిన దారుణ ఘటన రాజస్తాన్ లో చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. మద్యం మత్తులో అంబులెన్స్ డ్రైవర్ ఫ్లైఓవర్‌పై వెళ్తూ.. బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు కూడా గాయపడ్డారు. ఆసుపత్రి అంబులెన్స్‌ను నడుపుతున్నప్పుడు డ్రైవర్ పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడు.
మృతి చెందిన మహిళ బుండి జిల్లాలోని కప్రేన్‌కు చెందిన మన్‌భార్ బహీగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మృతురాలి భర్త, అత్త, కొడుకులకు గాయాలయ్యాయి. బైక్‌ను ఢీకొట్టిన.. అనంతరం మద్యం మత్తులో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ ఆ వాహనాన్ని ఫ్లైఓవర్ సేఫ్టీ రెయిలింగ్ ను ఢీకొట్టాడు. అక్కడ వాహనాన్ని వేలాడుతూ ఉంది. ఈ ఘటన కెమెరాకు చిక్కింది.
గుమన్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొట్డి చవానీ ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం ప్రభావం ఎక్కువగా ఉండడంతో అంబులెన్స్ డివైడర్‌ను దాటి లేన్‌కు అవతలివైపుకి వెళ్లి బోల్తా పడింది. ప్రమాదం తర్వాత.. డ్రైవర్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అతను రెండు క్వార్టర్స్ మద్యం సేవించినట్లు వైద్య పరీక్షలో వెల్లడైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..