Viral Video: రామ చిలుక వీడియో వైరల్.. దీని యాక్షన్‌కి ఆస్కార్ కూడా తక్కువే..

పెంపుడు పక్షులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన పెంపుడు చిలుకకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసేందుకు చాలా అద్భుతంగా ఉంది.

Viral Video: రామ చిలుక వీడియో వైరల్.. దీని యాక్షన్‌కి ఆస్కార్ కూడా తక్కువే..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Apr 01, 2023 | 12:05 PM

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాల వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి.  కొన్ని వీడియోలు సరదాగా ఉండి నవ్విస్తే.. మరికొన్ని షాకింగ్ గా ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు, పక్షులకు  సంబంధించిన వీడియోలు నెటిజన్లకు విపరీతంగా నచ్చుతాయి. పెంపుడు జంవుతువులు, పెంపుడు పక్షులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన పెంపుడు చిలుకకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసేందుకు చాలా అద్భుతంగా ఉంది.

వైరల్ అవుతున్న వీడియోలో చిలుక తన నటనను అద్భుతంగా ప్రదర్శిస్తోంది.  సన్నివేశానికి తగినట్లుగా నటించింది. అందమైన రామ చిలుక ఒక బొమ్మ పిస్టల్ ను తన ముక్కుతో పట్టుకుని అక్కడ ఉన్న యజమాని చేతిలో పెట్టింది. అనంతరం ఆ యజమాని ఆ పిస్టల్ ను రామ చిలుక వైపు గురి పెట్టి.. పేల్చాడు. వెంటనే ఆ చిలుక బులెట్ దెబ్బ తగిలి కింద పడినట్లు యాక్షన్ చేసింది. ఈ సన్నివేశం చూసిన నెటిజన్లు చిలుక యాక్షన్ కు ఫిదా అవుతున్నారు.  మీరు చిలక్కి ఎలా నేర్పారు అని కామెంట్ చేస్తే.. అదేకదా స్నేహం గొప్పతనం అని అంటున్నారు. అంతేకాదు దీని యాక్షన్ కు ఆస్కార్ కూడా తక్కువే అని కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి రామ చిలుకలు రంగులతో ఆకర్షణీయంగా ఉంటాయి. మనుషులకు మచ్చికైన పక్షులు. తన ముద్దు ముద్దు మాటలతో అలరిస్తుంటాయి. కొన్ని పాటలు పాడతాయి. మరికొన్ని తమ యజమాని ఏమి చేస్తే.. దానినే అనుసరిస్తూ అలరిస్తాయి. అందుకే చిలుకలను పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..