Viral News: పొదుపు చేయడం కూడా ఒక కళే.. ఖర్చులను అదుపులో పెట్టుకుని కోటీశ్వరులైన జంట.. ఎక్కడంటే

డబ్బు అవసరం ఉన్నప్పుడే ఖర్చు చేయాలని.. అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం కూడా నేరమేనని టాన్నర్ అంటున్నాడు. ప్రపంచంలోని ప్రతి దానికీ డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మనకు కూడా చాలా వస్తువులు ఉచితంగా లభిస్తాయని చెబుతున్నాడు

Viral News: పొదుపు చేయడం కూడా ఒక కళే.. ఖర్చులను అదుపులో పెట్టుకుని కోటీశ్వరులైన జంట.. ఎక్కడంటే
Tanner Firl
Follow us

|

Updated on: Apr 01, 2023 | 11:07 AM

ప్రతి వ్యక్తి జీవితంలో పొదుపు చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ తమ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని ఆదా చేసుకోవాలి..  ఎందుకంటే  ఈ రోజు మీరు నన్ను పొదుపు చేస్తే.. రేపు మిమ్మల్ని రక్షిస్తాను అని అంటుందట డబ్బు. అయితే  నేటి తరం యువతీయువకులు పొదుపు అన్న మాటనే మర్చిపోయినట్లున్నారు. భిన్నమైన అలవాట్లు.. లగ్జరీ లైఫ్ కు అలవాటు పడి పొదుపు అన్న మాటనే మరచిపోతున్న పరిస్థులు ఏర్పడుతున్నాయి. తాము సంపాదించిన దాని కంటే ఎక్కువగా ఖర్చులు చేస్తున్నారు. అయితే ఓ జంట నేటి తరానికి భిన్నం. తమ సంపాదనతో కాకుండా పొదుపుతో కోటీశ్వరులు అయ్యారు. మరి ఈ జంటకు సంబంధించిన పొదుపు కథను గురించి తెలుసుకుందాం..

అమెరికాలోని మిన్నియాపాలిస్‌ లో నివసిస్తున్న టాన్నర్ ఫిర్ల్ వయస్సు 29 సంవత్సరాలు.. నేడు కోటీశ్వరుడు. అది కూడా అతను చేసిన పొదుపు వల్లే! అవును.. పొదుపు చేయడం.. అతను 26 సంవత్సరాల వయస్సు నుండి పొదుపు చేయడం ప్రారంభించాడు.  మూడు సంవత్సరాలు ఆర్థికంగాపొదుపు పాటిస్తూ.. టాన్నర్ ఫిర్ల్ మూడు కోట్లు ఆదా చేశాడు. డబ్బును ఆదా చేయడానికి, అతను రాకెట్ సైన్స్‌ని ఉపయోగించలేదు. తన అవసరాలకు బ్రేక్‌లు వేశాడు. ప్రపంచం తనను పిసినారి అంటూ పిలుస్తున్నా.. పట్టించుకోకుండా అతను డబ్బును ఆదా చేశాడు. అతను తనకి తాను ఆర్థిక శాస్త్రవేత్తగా భావిస్తాడు.

కోట్ల రూపాయలు ఆదా   డబ్బు అవసరం ఉన్నప్పుడే ఖర్చు చేయాలని.. అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం కూడా నేరమేనని టాన్నర్ అంటున్నాడు. ప్రపంచంలోని ప్రతి దానికీ డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మనకు కూడా చాలా వస్తువులు ఉచితంగా లభిస్తాయని చెబుతున్నాడు. ఇతని అనుభవం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంతేకాదు ఒక వ్యక్తి ఎప్పుడూ పేదరికంలో జీవించాలని టాన్నర్ ఫిర్ల్ చెబుతూ ఉంటాడు. తద్వారా డబ్బును పొదుపు చేయడం నేర్చుకోగలడు. అంతేకాదు ఖర్చులను అదుపు చేసుకుంటూ డబ్బును పొదుపు చేయడం లోప భూయిష్టమైనది కాదు.. ఎవరూ మీకు మద్దతు ఇవ్వనప్పుడు మీకు సహాయపడే ఒక రకమైన పొదుపు.

ఇవి కూడా చదవండి

సింపుల్‌గా చెప్పాలంటే పొదుపు అంటే మీ సంపాదన కంటే దాచడం కోసం ఎక్కువ కష్టపడాలి.. తన పొదుపు గురించి మాట్లాడుతూ.. ఎక్కువ కాలం డబ్బు సంపాదించడం ఇష్టం లేదని.. అందుకనే పొదుపు మంత్రం పాటించినట్లు.. ఇలా తనకు 35 ఏళ్ళ వరకూ పొదుపు  చేస్తూ రిటైరవ్వాలనుకుంటున్నానని చెప్పాడు. ఐదు కోట్ల రూపాయల వరకు పొదుపు చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఆంగ్ల వెబ్‌సైట్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం..  CNBC టాన్నర్ వీడియోను పోస్ట్ చేసింది. అందులో మీరు మీ డబ్బును ఎలా ఆదా చేసుకోవచ్చో చెప్పాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపొచ్చు..
ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపొచ్చు..
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..
వామ్మో..! గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. 13మంది అరెస్ట్
వామ్మో..! గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. 13మంది అరెస్ట్
ఈ ఒక్కపని చేస్తే చాలు.. గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతుంది
ఈ ఒక్కపని చేస్తే చాలు.. గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతుంది
పరేషాన్ చేయకే మల్లన్న.. కొంపముంచిన ఈటలతో సరదా..
పరేషాన్ చేయకే మల్లన్న.. కొంపముంచిన ఈటలతో సరదా..
ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి