Super Mom: ఈ కుక్క సూపర్ మామ్.. కేవలం 27 గంటల్లోనే ఈ శునకం ఎన్ని పిల్లలకు జన్మనిచ్చిందో తెలిస్తే షాక్
కుక్క గర్భం దాల్చిన తర్వాత 57 నుంచి 63 రోజుల్లో పిల్లలకు జన్మనిస్తుంది. అయితే ఒకొక్క కాన్పులో ఐదు నుంచి తొమ్మిది వరకూ జన్మనిచ్చిన సంఘటనలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ పిల్లలకు కుక్క జన్మనివ్వడం మహా అరుదైన ఘటన అని చెప్పవచ్చు.. అయితే తాజాగా ఓ శునకం ఏకంగా 21 కుక్క పిల్లలకు జన్మనిచ్చి హౌరా అనిపించింది.
మానవులకు అత్యంత గొప్ప స్నేహితుడు కుక్క.. ఇంకా చెప్పాలంటే మనిషి మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు కుక్క.. తమ కుటుంబ సభ్యుల్లా భావించి కుక్కలను పెంచుకుంటారు. అంతేకాదు తమ పెంపుడు కుక్కకు పుట్టిన రోజు శ్రీమంత వేడుక వంటివి చేసి వాటిపై తమకున్న ప్రేమని చాటుకున్నారు కూడా.. అయితే కుక్క గర్భం దాల్చిన తర్వాత 57 నుంచి 63 రోజుల్లో పిల్లలకు జన్మనిస్తుంది. అయితే ఒకొక్క కాన్పులో ఐదు నుంచి తొమ్మిది వరకూ జన్మనిచ్చిన సంఘటనలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ పిల్లలకు కుక్క జన్మనివ్వడం మహా అరుదైన ఘటన అని చెప్పవచ్చు.. అయితే తాజాగా ఓ శునకం ఏకంగా 21 కుక్క పిల్లలకు జన్మనిచ్చి హౌరా అనిపించింది. నమ్మశక్యం కానీ ఈ ఘటనకు వేదికగా మారింది ఆగ్రరాజ్యం అమెరికా. వివరాల్లోకి వెళ్తే..
వర్జీనియా నగరంలో గ్రేట్ డేన్ జాతికి చెందిన ఒక కుక్క ఒకేసారి 21 మంది కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. ఈ కుక్క పేరు నేమీన్. మొత్తం 21 కుక్క పిల్లలకు .. 27 గంటల్లో జన్మనిచ్చింది. తాను అన్ని కుక్క పిల్లలను చూసి ఆశ్ఛర్యపోయానని కుక్క యజమాని టాన్యా డబ్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ నేమీన్ నెట్టింట్లో ఓ రేంజ్ లో సెలబ్రెటీగా మారింది. నెటిజన్లు.. కుక్కను సూపర్ మామ్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
టాన్యా పెంపుడు జంతువుల సంరక్షణాలయ్యాన్ని నిర్వహిస్తున్నారు. తాను ఇప్పటి వరకూ ఎప్పుడూ ఏ కుక్కా ఇలా ఒకేసారి ఇన్ని పిల్లలని కనడం చూడలేదని అంటున్నారు. ఈ కుక్క ఏ ఏడో, ఎనిమిదో పిల్లలకు జన్మనిస్తుంది అనుకున్నా.. అయితే వరసగా 16 పిల్లలను కన్నది.. ఇదే లాస్ట్ అనుకుంటే.. మళ్ళీ కొన్ని గంటల సమయం తర్వాత.. వరసగా ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. అంటూ టాన్యా చెప్పారు. రెండు కుక్క పిల్లలు మినహా నామినే కుక్కపిల్లలన్నీ ఒక పౌండ్ కంటే ఎక్కువ బరువున్నాయని చెప్పారు. వీటిలో 12 ఆడపిల్లలని.. మిగిలినవి మొగ కుక్కలని తెలిపారు టాన్యా. అన్ని పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని.. వీటిల్లో కొన్నిటిని అమ్మేసి.. అలా వచ్చిన డబ్బులతో జంతు సంరక్షణ సంస్థకు ఇస్తానని చెప్పారు.
గ్రేట్ డేన్స్ జాతి కుక్కలు ప్రపంచంలోని భారీ కుక్కల్లో ఒకటి. ఒక్కొక్కటి సుమారు 45 కేజీల బరువు, రెండున్నర మీటర్ల పొడవుంటాయి. వెనకు కాళ్లపై నిటారుగా నిలబడితే.. ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు కనిపిస్తాయి.
అయితే ఇప్పటి వరకూ ప్రపంచంలో అత్యధిక కుక్కపిల్లలకు జన్మినిచ్చిన కుక్కగా టియా పేరుతో రికార్డ్ ఉంది. ఈ టియా 2004లో 24 పిల్లలకు జన్మనిచ్చి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..