AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mysterious Virus: మానవాళిపై పగబట్టిన వైరస్‌లు .. ఆఫ్రికాలో వింత వైరస్ కలకలం .. ముక్కునుంచి రక్తస్రావంతో ముగ్గురు మృతి..

బురుండీలోని బెజీరో అనే పట్టణంలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. ఈ వింత వ్యాధి బారిన పడినవారిలో జ్వరం, తలనొప్పి, వాంతులు, మైకం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని ఆ దేశ వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ దేశంలోని ప్రజారోగ్య అధికారులు ఈ వైరస్ వ్యాప్తిని యంత్రించడానికి చర్యలు మొదలు పెట్టారు. 

Mysterious Virus: మానవాళిపై పగబట్టిన వైరస్‌లు .. ఆఫ్రికాలో వింత వైరస్ కలకలం .. ముక్కునుంచి రక్తస్రావంతో ముగ్గురు మృతి..
Mysterious Virus In Africa
Surya Kala
|

Updated on: Mar 31, 2023 | 7:57 AM

Share

గత మూడేళ్ళుగా ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ఓ రేంజ్ లో భయపెడుతూనే ఉంది.. మరోవైపు గుర్తు తెలియని వైరస్ లు మేమున్నామంటూ మనవాళిపై విరుచుకుపడుతున్నాయి. తాజాగా ఆఫ్రికాలో ఓ మిస్టరీ వ్యాధి కలవర పెడుతోంది. ఆఫ్రికాలోని   మిస్టరీ వైరస్ బురుండిలోని ఒక చిన్న పట్టణాన్ని స్తంభింపజేసింది. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వ్యాధి సోకినవారికి ముక్కు వెంట రక్తం కారుతోంది. ఇప్పటికే ఈ వ్యాధి సోకి ముగ్గురు మరణించారు.

బురుండీలోని బెజీరో అనే పట్టణంలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. ఈ వింత వ్యాధి బారిన పడినవారిలో జ్వరం, తలనొప్పి, వాంతులు, మైకం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని ఆ దేశ వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ దేశంలోని ప్రజారోగ్య అధికారులు ఈ వైరస్ వ్యాప్తిని యంత్రించడానికి చర్యలు మొదలు పెట్టారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ మిస్టరీ వైరస్ లు  మార్ బర్గ్ గానీ..ఎబోలా కాదని బురుండీ దేశ వైద్యశాఖ అధికారులు స్పష్టంచేశారు.

ఈ వింత వ్యాధిని నియంత్రించటానికి చర్యలు చేపట్టిన వ్యాధి లక్షణాలు కలిగిన బాధితులను చికిత్స నిమిత్తం ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఇప్పటికే అధికారులు బెజీరో ప్రాంతంలో క్వారంటైన్ విధించారు. అయితే ఈ వింత వైరస్ బారిన పడిన వ్యక్తులు త్వరగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని.. మరణించిన ముగ్గురు రోగులు ఆసుపత్రికి చేరుకోవడానికి  కంటే ముందే ముక్కు-రక్తస్రావం జరిగి మరణించారని మిగ్వా ఆరోగ్య కేంద్రానికి చెందిన ఒక నర్సు చెప్పినట్లుగా మిర్రర్ పేర్కొంది. ముగ్గురు బాధితులు 24 గంటల్లోనే చనిపోయారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

గత ఫిబ్రవరిలో బురుండీకి పొరుగున ఉన్న టాంజానియా దేశంలో  మార్గ్ బర్గ్ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సమీప దేశాలను హెచ్చరించింది. అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ముక్కు వెంట రక్తం స్రావం అవయి ప్రాణాలు తీసే ఈ వింత వ్యాధి ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..