AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Third World War: థర్డ్‌ వరల్డ్‌ వార్‌ ముంగిట్లో ప్రపంచం..? నల్ల సముద్రంలో ఢీ అంటే ఢీ అంటున్న రష్యా-అమెరికా

అమెరికా స్టెప్స్‌కి అంతే స్ట్రాంగ్‌ రియాక్టవుతోంది రష్యా. ఉక్రెయిన్‌కి గానీ అధునాతన ఆయుధాలు అందిస్తే అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరించారు పుతిన్‌. తమను కవ్విస్తే న్యూక్లియర్‌ బటన్‌ నొక్కుతామంటూ అల్టిమేటం ఇచ్చారు.

Third World War: థర్డ్‌ వరల్డ్‌ వార్‌ ముంగిట్లో ప్రపంచం..? నల్ల సముద్రంలో ఢీ అంటే ఢీ అంటున్న రష్యా-అమెరికా
America Joe Biden Vs Russia
Surya Kala
|

Updated on: Apr 01, 2023 | 7:42 AM

Share

థర్డ్‌ వరల్డ్‌ వార్‌కి టైమ్‌ దగ్గరపడిందా!. ఉక్రెయిన్‌-రష్యా వార్‌ ప్రపంచ యుద్ధంగా మారబోతుందా! అంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి . ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి వన్‌ఇయర్‌ కంప్లీటైన నెక్ట్స్‌-డే నుంచే పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ జెలెన్‌స్కీ వేస్తోన్న అడుగులు, చేస్తోన్న ప్రకటనలు కూడా అందుకు ఊతమిస్తున్నాయి. ఇప్పుడీ వార్‌లోకి అమెరికా ఎంటరయ్యే సూచనలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. రష్యా తీరం సమీపానికి అమెరికా యుద్ధనౌకలు రావడంతో కలకలం రేగింది. కౌంటర్‌గా రష్యా న్యూక్లియర్‌ సబ్‌మెరైన్లను మోహరించడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒకవైపు అమెరికా, ఇంకోవైపు రష్యా పోటాపోటీగా సముద్రంలో యుద్ధ విన్యాసాలు చేస్తుండటం చూస్తుంటే మూడో ప్రపంచం యుద్ధానికి ముహూర్తం దగ్గర పడిందా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే నల్ల సముద్రంలో రష్యా-అమెరికా ఢీ అంటే ఢీ అంటున్నాయి. అమెరికా అయితే ఒక అడుగు ముందుకేసి ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ను కూడా రంగంలోకి దిగింది. ఒకవేళ అమెరికా సీన్‌లోకి దిగితే మాత్రం ఉక్రెయిన్‌-రష్యా వార్‌…. రష్యా వర్సెస్ నాటోగా మారడం ఖాయం. అదే జరిగితే రష్యా మిత్రదేశాలు కూడా యుద్ధరంగంలోకి దిగడం కన్ఫ్మామ్‌.

అమెరికా స్టెప్స్‌కి అంతే స్ట్రాంగ్‌ రియాక్టవుతోంది రష్యా. ఉక్రెయిన్‌కి గానీ అధునాతన ఆయుధాలు అందిస్తే అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరించారు పుతిన్‌. తమను కవ్విస్తే న్యూక్లియర్‌ బటన్‌ నొక్కుతామంటూ అల్టిమేటం ఇచ్చారు. అమెరికాకి కౌంటర్‌గా ఆల్రెడీ అలెగ్జాండర్‌-3 అధునాతన న్యూక్లియర్‌ సబ్‌మెరైన్లను యుద్ధక్షేత్రంలోకి దింపారు పుతిన్‌. అమెరికా వార్‌ షిప్స్‌ను ఈ న్యూక్లియర్‌ సబ్‌మెరైన్స్‌తో ధ్వంసం చేస్తామని రష్యా హెచ్చరిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఒకవేళ అలెగ్జాండర్‌-3 న్యూక్లియర్‌ సబ్‌మెరైన్లను రష్యా వినియోగిస్తే వినాశనమే అంటున్నారు నిపుణులు. సముద్రపు లోతుల్లోనుంచి చాలా సైలెంట్‌గా దాడులు చేయడం ఈ జలాంతర్గాముల స్టైల్‌. రెగ్యులర్‌ వెపన్స్‌తోపాటు న్యూక్లియర్ ఆయుధాలను ఈ జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. అంతేకాదు, ఖండాంతర క్షిపణులను ప్రయోగించే సామర్ధ్యం ఈ సబ్‌మెరైన్లకు ఉంది. ఒకవేళ రష్యా వీటిని వినియోగించిందంటే మూడో ప్రపంచ యుద్ధం దాదాపు మొదలైనట్టే.

మరి, అమెరికా లేదా నాటో నేరుగా రంగంలోకి దిగుతాయా? లేక ఉక్రెయిన్‌కు సహకరిస్తాయా? ఒకవేళ ఉక్రెయిన్‌కు అధునాతన ఆయుధాలు అందిస్తే రష్యా ఎలా రియాక్టవుతుందనే ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న. అయితే, పుతిన్ పట్టుదల, బైడెన్‌ పంతం చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం ఇక ఎంత దూరంలో లేదనే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..