Viral Calf Photo: ఈ ఆవు దూడ పుట్టకతోనే చిన్నపాటి సెలబ్రెటీ.. హ్యాపీని చూడడానికి ఎగబడుతున్న జనం.. ఎందుకంటే?
ఆస్ట్రేలియాలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో హోల్‌స్టెయిన్ పాడి ఆవు ఓ దూడకు జన్మనిచ్చింది. ఈ ఆవు పిల్లను ఇప్పుడు ప్రజలు ముద్దుగా "హ్యాపీ" అని పిలుస్తున్నారు.. ఎందుకంటే దీని శరీరం వెనుకవైపు వెనుకవైపు చిరునవ్వుతో కూడిన ముఖం ఉంది.
భూమి మీద అనేక అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ప్రకృతి వింతలు, విశేషాలు, రహస్యాలు నెలవు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ అద్భుతం జరిగినా వెంటనే నెట్టింట్లో ప్రత్యక్షమవుతుంది. తాజాగా ఓ ఆవు దూడకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దూడ ముద్దుగా నలుపు తెలుపు రంగులో అందంగా కనిపిస్తోంది. అంతేకాదు ఈ ఆవు వెరీ వెరీ స్పెషల్ అనిపించేలా ఒక ఎమోజీ దర్శనమిస్తుంది. అయితే దీనిని ఎవరో ఆవు దూడ శరీరం పై పెయింట్ వెయ్యలేదు.. దేవుడే సహజంగా స్మైలీ ఎమోజీని పెయింట్ వేశారు. ఈ ఎమోజీని చూసి నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ ఆవు దూడ ఎక్కడుందో తెలుసుకుందాం..
హోల్‌స్టెయిన్ పాడి పశువుల జాతి . ఇవి ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసే పాడి జంతువులుగా ప్రసిద్ధి చెందాయి. ఆస్ట్రేలియాలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో హోల్‌స్టెయిన్ పాడి ఆవు ఓ దూడకు జన్మనిచ్చింది. ఈ ఆవు పిల్లను ఇప్పుడు ప్రజలు ముద్దుగా “హ్యాపీ” అని పిలుస్తున్నారు.. ఎందుకంటే దీని శరీరం వెనుకవైపు వెనుకవైపు చిరునవ్వుతో కూడిన ముఖం ఉంది. తన దూడ శరీరంపై ఎమోజీని చూసి సంబరపడిపోయిన యజమాని .. దాన్ని ఫొటో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు
ABC న్యూస్ ప్రకారం.. హ్యాపీ వెస్ట్ గిప్స్‌ల్యాండ్‌లోని రిపుల్‌బ్రూక్‌లోని ఒక స్టడ్ ఫామ్‌లో జన్మించింది. ఏడాదికి 700 దూడలను పెంచే మేగాన్, బారీ కోస్టర్ ఈ పొలానికి యజమానులు. ఈ జాతికి చెందిన దూడలు ఏడాదిలో సుమారు 700 వరకూ జన్మిస్తాయని, కానీ ఈ దూడ మాత్రం అన్నింటికీ భిన్నంగా ఉందని యజమాని మేగాన్ తెలిపారు. హ్యాపీ పుట్టినప్పుడు.. దీని శరీరం పై విభిన్న గుర్తులు ఉన్నాయని బారీ కోస్టర్ గమనించింది. ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ప్రస్తుతం ఈ ఆవు దూడ వైరల్‌గా మారింది.
ఈ వారాంతంలో “హ్యాపీ”ని చూడటానికి దాదాపు 40,000 నుండి 50,000 మంది వస్తూనే ఉన్నారు. హ్యాపీని చూసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు. వావ్ ఆవు దూడ చాలా అందంగా ఉంది. ఇలాంటి స్మైలీ ఎమోజీ ఆవును ఎక్కడా చూడలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. తనను చూసిన ప్రతి ఒక్కరి ముఖంలో హ్యాపీ చిరునవ్వు తెప్పిస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..