Viral Video: హెలికాప్టర్ షాట్ల వర్షం కురిపిస్తున్న ‘చిన్నారి ధోని’.. ఆలస్యమెందుకు..? ఓ సారి చూసేయండి..
హెలికాప్టర్ షాట్‌కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కానీ అందులో హెలికాప్టర్ సిక్సర్లు కొడుతోంది టీమిండియా మాజీ సారథి కానే కాదు. అవును, ఆ వీడియోలో ఓ చిన్నారి తన బ్యాటింగ్
క్రికెట్ ప్రపంచానికి హెలికాప్టర్ షాట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని మైదానంలోకి దిగి ఒక్క హెలికాప్టర్ షాట్ కొట్టాడంటే చాలు.. క్రికెట్ అభిమానులకు పండగే పండగ. ధోని కొట్టిన హెలికాప్టర్ షాట్స్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో స్టేటస్‌గా పెట్టుకుని మురిసిపోయే అభిమానులు కూడా లక్షల సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఇప్పుడు అదే షాట్‌కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కానీ అందులో హెలికాప్టర్ సిక్సర్లు కొడుతోంది టీమిండియా మాజీ సారథి కానే కాదు. అవును, ఆ వీడియోలో ఓ చిన్నారి తన బ్యాటింగ్ ప్రాక్టీస్ సందర్భంగా ఇలా ధోనిని గుర్తుచేసేలా వరుస హెలికాప్టర్ షాట్స్ బాదుతోంది. ఇక దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ఇన్‌స్టా ఖాతా నుంచి పోస్ట్ చేశాడు. దీంతో అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
‘వాహ్, వాహ్, వాహ్ ??, సోషల్ మీడియాలోని అద్భుతమైన వీడియో.. ఇదే కదా ధోని ప్రభావం.. ముంబై ఇండియన్స్.. ఈమెపై ఓ కన్నేసి ఉండండి..’ అనే క్యాప్షన్‌తో బజ్జీ పోస్ట్ చేశాడు. మహిళా క్రికెటర్ల కోసం బీసీసీఐ ఆధ్వర్యంలో 2023 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే కదా.. డడ్య్లూపీఎల్ టోర్నీలోకి ఈ చిన్నారి ఉపయోగపడుతుందని బజ్జీ.. ఐపీఎల్‌లో తన మాజీ టీమ్ అయిన ముంబై ఇండియన్స్‌కి సూచించాడు.
View this post on Instagram
ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు ‘ధోనికి ఆమె లేడీ వెర్షన్’ అంటూ రాసుకొస్తున్నారు. ఇంకా కొందరైతే ‘బంతి కోసం ఆమె చేసే ఫుట్ వర్క్ అయితే అద్భుతం’ అంటూ ప్రశంసిస్తున్నారు. ‘కోహ్లీ, ధోనిని కలిపితే ఈ చిన్నారే’ అని, ‘హెలికాప్టర్, స్ట్రెయిట్ డ్రైవ్‌లను కలిపి ఒకేసారి కొడుతోంది’ అంటూ నెటిజన్లు ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ఈ వీడియోను హర్భజన్ ఈ రోజు ఉదయం 10 గంటల తర్వాత షేర్ చేయగా.. దీనికి ఇప్పటివరకు 35 వేల లైకులు., 1 లక్షా 85వేల వీక్షణలు వచ్చాయి. ఇంకా నెటిజన్లు ఈ వీడియోను చూసి, ప్రతిస్పందిస్తూనే ఉన్నారు.