Mercury Transit 2023: జూన్ 7 వరకు ఈ 3 రాశులవారికి కష్టకాలం.. వెంటాడనున్న ఆనారోగ్యం, వివాదాలు.. కారణం ఏమిటంటే..?

మార్చి 31 మధ్యహ్నం 2.44 గంటలకు బుధుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం రాహువు కూడా ఇదే రాశిలో సంచరిస్తున్నాడు.  ఇంకా జూన్ 7 వరకు కూడా బుధుడు మేషరాశిలోనే ఉంటాడు. జూన్ 7 తర్వాత బుధుడు..

Mercury Transit 2023: జూన్ 7 వరకు ఈ 3 రాశులవారికి కష్టకాలం.. వెంటాడనున్న ఆనారోగ్యం, వివాదాలు.. కారణం ఏమిటంటే..?
Budh Grah Fochar 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 03, 2023 | 9:55 AM

Budh Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాల కదలికలు మానవ జీవితంపై ప్రభావం చూపుతాయి. ఇవి కొందరికి మేలు చేసేవిగా, మరికొన్ని కీడు కలిగించేవిగా ఉంటాయి. ఇక ఈ క్రమంలోనే మార్చి 31 మధ్యహ్నం 2.44 గంటలకు బుధుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం రాహువు కూడా ఇదే రాశిలో సంచరిస్తున్నాడు.  ఇంకా జూన్ 7 వరకు కూడా బుధుడు మేషరాశిలోనే ఉంటాడు. జూన్ 7 తర్వాత బుధుడు మేషరాశి నుంచి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే అప్పటివరకు మేషరాశిలో బుధగ్రహ సంచారం వల్ల రాశిచక్రమంలోని మూడు రాశులవారు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొనున్నారు. మరి ఆ దురదృష్ట రాశులేమిటో ఇప్పుడు చూద్దాం..

మేషరాశిలో బుధ గోచారం ఈ రాశులకు నష్టదాయకం

వృషభ రాశి: మేషరాశిలో బుధ గ్రహ సంచారం వృషభ రాశివారి వృత్తిలో సమస్యలను సృష్టిస్తుంది. ఉద్యోగులకు ఈ సమయం అస్సలు కలిసి రాదు. మీ ఆర్థిక పరిస్థితి కూడా పూర్తిగా దిగజారుతుంది. మీరు పనిలో సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కన్యారాశి: బుధ సంచారం వల్ల కన్యారాశి వారికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. జూన్ 7 వరకు కూడా మీకు పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. మీకు అనుకోని ఆపదలు వచ్చి పడే ప్రమాదం ఉంది. మీరు మానసిక ఒత్తిడికి గురవడంతో పాటు.. మీకు ఆఫీసులో సహచరుల మద్దతు లభించదు. వృశ్చిక రాశి: బుధ గ్రహం మేషరాశిలో సంచరించడం వల్ల వృశ్చిక రాశి వారికి నష్టాలను కలుగుతాయి. ఈ సమయంలో మీరు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఈ సమయంలో రుణ విముక్తి పొందలేరు. మీ ఆరోగ్యం కూడా చెడిపోవడమే కాక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో మీరు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)