RCB vs MI: ఆదిలోనే చెత్త రికార్డు మూట గట్టుకున్న హైదరాబాదీ బౌలర్.. ఒక్క ఓవర్‌తో గణాంకాలన్నీ గల్లంతు..
ఇప్పుడు అందరి నోట కూడా ఆర్‌సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ పేరే వినిపిస్తుంది. అందుకు అతను సృష్టించిన చెత్త రికార్డే కారణమని చెప్పుకోవాలి. అవును, ముంబై బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో ఆర్‌సీబీ తరఫున 19వ ఓవర్ వేసిన సిరాజ్..

ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా జరిగిన 5వ మ్యాచ్‌లో ముంబైపై 8 వికెట్ల తేడాతో ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు అందరి నోట కూడా ఆర్‌సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ పేరే వినిపిస్తుంది. అందుకు అతను సృష్టించిన చెత్త రికార్డే కారణమని చెప్పుకోవాలి. అవును, ముంబై బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో ఆర్‌సీబీ తరఫున 19వ ఓవర్ వేసిన సిరాజ్ ఏకంగా 5 వైడ్ బాల్స్ వేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఆ ఓవర్ ఓ చెత్త రికార్డుగా నిలిచిపోయింది. అంతేకాక ఐపీఎల్ 16వ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లోనే సిరాజ్ ఇలా చేయడం అందిరినీ ఆశ్చర్యపరిచింది. అంతకముందు ముంబై పవర్‌ప్లేలో విధ్వంసం సృష్టించిన సిరాజ్.. ప్రత్యర్థి బ్యాటర్లను బాగా కట్టడి చేశాడు. పవర్ ప్లే 6 ఓవర్లలో 3 ఓవర్లు సిరాజ్ వేయగా.. వాటిలో 5 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇంకా ఇషాన్ కిషన్ వికెట్ కూడా అతని ఖాతాలో పడింది.
అయితే సిరాజ్ గణాంకాలు కరెక్ట్‌గా ఉన్నాయని అందరూ భావిస్తున్న క్రమంలోనే తిలక్ వర్మ ముందు అతను తేలిపోయాడు. ముంబై తరఫున సీనియర్లు అంతా విఫలమైనా, యువ ఆటగాడు తిలక్ వర్మ చాలా బాగా రాణించాడు. ఆ క్రమంలోనే 19వ ఓవర్ బౌలింగ్ చేసిన సిరాజ్ తొలి రెండు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా 4 వైడ్ బాల్స్ వేశాడు. మూడో బంతికి 2, నాలుగో బంతికి 4 పరుగులు వచ్చాయి. ఆపై మరో వైడ్ బంతి. అనంతరం ఐదో బంతి 4, ఆరో బంతికి పరుగులు రాలేదు. ఇలా సిరాజ్ తన ఓవర్(0, 1, Wd, Wd, Wd, Wd, 2, 4, Wd, 4, 0)ని ముగించాడు. దీంతో అతని ఓవర్‌లో మొత్తం 16 పరుగులు వచ్చినట్లయింది. ఇక సిరాజ్ ఇన్నింగ్స్ గణాంకాలు కూడా 3 ఓవర్లలో 5 పరుగుల నుంచి 4 ఓవర్లలో 21 పరుగులకు చేరుకున్నాయి.
Siraj in the Powerplay (3 overs) : 1, 0, 0, 0, 1, 0, 0, 0, W, 1, 0, 0, Wd, 1, 0, 0, 0, 0, 0.
Siraj in 19th over (1 over) : 0, 1, Wd, Wd, Wd, Wd, 2, 4, Wd, 4, 0.
Most improved bowler in recent years ?#RoyalChallengersBangalore#RCBvMI #MIvsRCB #IPL23 pic.twitter.com/uE17jsLJKl
— ?????? ????? (@BooksAndCricket) April 2, 2023
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేశారు. ఈ క్రమంలో ముంబై తరఫున తిలక్ వర్మ అజేయంగా 84 పరుగులు(46 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన ఆర్‌సీబీకి కెప్టెన్ డూప్లసీస్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ శుభారంభం అందించడంతో.. ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయి 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అజేయంగా 82 పరుగులు చేసి అభిమానులను అలరించాడు.



