- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: RCB Wicket Keeper Dinesh Karthik completes 200 Catches becomes 3rd player in T20 Cricket
RCB vs MI: ఆరంభంలోనే ప్రపంచ రికార్డు సృష్టించిన డీకే.. క్రికెట్ చరిత్రలో ధోని తర్వాతి అతడే..
ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్ అందుకున్న ఆర్‌సీబీ దినేష్ కార్తిక్ ఓ సరికొత్త రికార్డును సృష్టించాడు. తద్వారా టీమిండియా టీ20 చరిత్రలో ఆ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా కూడా, ధోని తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. మరి ఆ రికార్డు వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Apr 03, 2023 | 6:50 AM

IPL 2023: ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ముంబై బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో ఆర్‌సీబీ వికెట్ కీపర్‌గా ఉన్న దినేష్ కార్తిక్ ఓ ప్రపంచ రికార్డును సృష్టించాడు. మరోవైపు ఐపీఎల్ సీజన్ 16లో తన ఆరంభ మ్యాచ్‌లోనే డీకే ఈ ఘనత సాధించడం విశేషం.

అవును, చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌కు రోహిత్ శర్మ(1) క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్యాచ్‌తో టీ20 క్రికెట్‌లో 200 క్యాచ్‌లు పట్టిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇంకా ఈ ఘనత సాధించిన భారత రెండో వికెట్ కీపర్‌గా కూడా డీకే నిలిచాడు.

టీ20 క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్‌కీపర్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. డి కాక్ ఇప్పటివరకు మొత్తం 207 క్యాచ్‌లు పట్టాడు.

టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్‌కే ప్రస్తుత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రెండో స్థానంలో ఉండగా.. ఇప్పటివరకు 203 క్యాచ్‌లను ఎంఎస్‌డీ పట్టుకున్నాడు.

అలాగే, తాజాగా 200 క్యాచ్‌లను పూర్తి చేయడం ద్వారా దినేష్ కార్తీక్ కూడా.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మూడవ వికెట్ కీపర్‌గా నిలిచాడు. అలాగే ప్రస్తుత ఐపీఎల్ ద్వారా క్వింటన్ డి కాక్, మహేంద్ర సింగ్ ధోనీలకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నాడు డీకే.




