Health Tips: సీజన్ ఏదైనా తీసుకోవసిన ఆహారాలివే.. తింటే ఏ ఆరోగ్య సమస్యా మీ దరి చేరదు.. ఎందుకంటే..?

వేసవికాలంలో వడదెబ్బ, నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కువ నీటిని తాగడంతోపాటు రోగనిరోధక శక్తిని మెరుగు పరుచుకోవడం చాలా ముఖ్యం. అయితే రోగనిరోధక శక్తిని

Health Tips: సీజన్ ఏదైనా తీసుకోవసిన ఆహారాలివే.. తింటే ఏ ఆరోగ్య సమస్యా మీ దరి చేరదు.. ఎందుకంటే..?
Immunity
Follow us

|

Updated on: Apr 02, 2023 | 1:57 PM

మారుతున్న జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. సాధారణంగా వ్యాధులను నివారించడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం అవసరం. ఎండాకాలంలోని ఎండల నుంచి, సీజనల్ గాలుల నుంచి మనల్ని కాపాడుకోవడంలో రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో వడదెబ్బ, నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కువ నీటిని తాగడంతోపాటు రోగనిరోధక శక్తిని మెరుగు పరుచుకోవడం చాలా ముఖ్యం. అయితే రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలను చేర్చుకోవడం ద్వారా సీజనల్ వ్యాధుల నుంచి రక్షణతో పాటు ఇమ్యూనిటీ పవర్ మెరుగుపడుతుంది. అందుకోసం ఆహారంలో కొన్ని పండ్లు, కూరగాయలు, గింజలు తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. తద్వారా  ఏ ఆరోగ్య సమస్యా కూడా మీ దరి చేరదు. మరి ఈక్రమంలో ఇంకా ఏయే ఆహారాలను తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

విటమిన్ సి: రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సిట్రస్ పండ్లు చాలా ప్రభావవంతంగా ఉన్నాయని రుజువు చేస్తుంది. సిట్రస్ పండ్లలో, మీరు నారింజ, నిమ్మ, కివి, ఉసిరి, ద్రాక్ష, జామ, ప్లం వంటి పండ్లను తీసుకోవాలి.

పసుపు కలిపిన పాలు: శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే పసుపును పాలతో కలిపి తీసుకుంటే చాలు. పసుపు, ఔషధ గుణాలు సమృద్ధిగా, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పసుపును తీసుకోవడం వల్ల శరీర నొప్పులు దూరమవుతాయి. రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. పాలతో పసుపు కలిపి తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. కాల్షియం, ప్రొటీన్లు, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్లు ఎ, డి, కె, ఇ, కొవ్వు పుష్కలంగా ఉన్న పాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇవి కూడా చదవండి

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కొవ్వు చేపలు, వాల్‌నట్‌లు, అవిసె గింజలు, చియా గింజలు, మొక్కల నూనెలలో ఉంటాయి. ఇది తెల్ల రక్త కణాల కార్యకలాపాలను పెంచుతుంది అలాగే బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడుతుంది.

ఉసిరి: ఉసిరికాయను తీసుకోవడం వల్ల కూడా మీ రోగనిరోధక శక్తి బలంగా తయారవుతుంది.  ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు ఉసిరికాయను పచ్చిగా కూడా ఉపయోగించవచ్చు. లేదా ఊరగాయ రూపంలో కూడా తీసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..