Heart Attack: ఉన్నట్లుండి గుండె పోటు వచ్చేది ఇవి తినడం వల్లే.. వెంటనే మానేయండి.

గుండెపోటుతో మరణిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా హృద్రోగాలతో మరణిస్తున్నారు. అప్పటి వరకు ఉల్లాసంగా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నట్లుండి కుప్పకూలిపోతున్నారు. మానవ శరీరంలో కీలక పాత్ర పోషిస్తున్న...

Heart Attack: ఉన్నట్లుండి గుండె పోటు వచ్చేది ఇవి తినడం వల్లే.. వెంటనే మానేయండి.
Heart Attack
Follow us

|

Updated on: Apr 02, 2023 | 2:08 PM

గుండెపోటుతో మరణిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా హృద్రోగాలతో మరణిస్తున్నారు. అప్పటి వరకు ఉల్లాసంగా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నట్లుండి కుప్పకూలిపోతున్నారు. మానవ శరీరంలో కీలక పాత్ర పోషిస్తున్న గుండె లయ తప్పడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అలాంటి వాటిలో తీసుకునే ఆహారం మొదటి స్థానంలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జీవనశైలిలో విపరీత మార్పులు, తీసుకునే ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, విపరీతమైన మానసిక ఒత్తిడి వెరసి గుండె సమస్యలకు దారి తీస్తున్నాయి.

గుండె జబ్బులకు ప్రధాన కారణం నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల ర‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోయి ర‌క్త‌స‌ర‌ఫ‌రాకు అడ్డంకులు ఏర్ప‌డ‌తాయి. ఇక గుండె సంబంధిత వ్యాధుల రావడానికి మరో కారణం ఉప్పు ఎక్కువగా తీసుకోవడం. ఉప్పుతో బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో గుండె కండ‌రాలు బిగుసుకు పోతాయి. షుగర్‌, పాలిష్‌ బట్టి ఆహారాలను తీసుకోవడం కూడా గుండె పోటుకు కారణంగా చెబుతున్నారు. మైదా, రవ్వ‌, ఉప్పుడు ర‌వ్వ వంటి వాటితో త‌యారు చేసిన ప‌దార్థాల‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి రక్తాన్ని చిక్కగా మారుస్తాయి. ఫస్ట్‌ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌లు కూడా శరీరంలో కొవ్వు పెరిగేందుకు కారణమవుతుంటాయి. అంతేకాకుండా ఇలాంటి పదర్థాలు చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతాయి. దీంతో గుండెకు రక్త సరఫరా సరిగ్గా జరగక గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి.

గుండె వ్యాధులు దరిచేరకుండా ఉండాలనే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజ‌లు, వాల్ న‌ట్స్, బాదం ప‌ప్పు వంటి వాటిని ఎక్కువ‌గా తీసుకోవాలని సూచిస్తున్ఆనరు. నూనెతో చేసిన ఆహార పదార్థాలను తగ్గిస్తూ, ఆల్కహాల్‌, స్మోకింగ్‌ వంటి వాటికి దూరంగా ఉండడం వల్ల గుండెను పది కాలల పాటు జాగ్రత్తగా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే మానసకి ఒత్తిడి తగ్గించుకునేందుకు మెడిటేషన్; యోగా వంటి వాటిని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్: పైనత తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే అందించినది. ఆరోగ్యం విషయంలో నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తతం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..