Hyderabad: హైదరాబాద్‌లో డేంజర్ ఇంజెక్షన్.. కండల మోజులో స్టెరాయిడ్స్ తీసుకుంటున్న యువత..
ఆరోగ్యమే మహాభాగ్యం.. తిండి తింటే కండ కలదు.. ఇది ఒకప్పటి మాట..ఇప్పుడు అంతా కండల క్రేజ్. సిక్స్‌ప్యాక్ మోజుతో యువత జిమ్‌లా బాటపడుతోంది. జిమ్‌లకి వెళ్లడం తప్పుకాదు.. కానీ ట్రైనర్ పర్యవేక్షణ లేకుండా ఓవర్ ఎక్సర్‌సైజ్ చేస్తే మొదటికే మోసం. ఐతే ఇప్పుడు మ్యాటర్ ఇది కాదు.. ఈ కండల షోకుతో యువత ఇప్పుడు ఏకంగా స్టెరాయిడ్స్ వాడేస్తున్నారు.
మహానగరంలో మత్తుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎంత నిఘా పెట్టినా సరే ఎక్కడో అక్కడ డ్రగ్ మాఫియా ఉనికి హడలెత్తిస్తోంది. మరోవైపు లేటెస్ట్‌గా మరో బేషరమ్ వ్యవహారం సంచలనం రేపింది. అదే కండల క్రేజ్‌లో స్టెరాయిడ్స్ దందా. జిమ్స్ టార్గెట్‌గా సాగుతోన్న స్టెరాయిడ్స్ రాకెట్‌కు చెక్ పెట్టారు రాచకొండ SOT పోలీసులు..
ఆరోగ్యమే మహాభాగ్యం.. తిండి తింటే కండ కలదు.. ఇది ఒకప్పటి మాట..ఇప్పుడు అంతా కండల క్రేజ్. సిక్స్‌ప్యాక్ మోజుతో యువత జిమ్‌లా బాటపడుతోంది. జిమ్‌లకి వెళ్లడం తప్పుకాదు.. కానీ ట్రైనర్ పర్యవేక్షణ లేకుండా ఓవర్ ఎక్సర్‌సైజ్ చేస్తే మొదటికే మోసం. ఐతే ఇప్పుడు మ్యాటర్ ఇది కాదు.. ఈ కండల షోకుతో యువత ఇప్పుడు ఏకంగా స్టెరాయిడ్స్ వాడేస్తున్నారు. బాడీని బంతిలా తిప్పేయాలనే మోజులో హైదరాబాద్ సిటీలోని అనేక జిమ్‌లో యువత స్టెరాయిడ్స్ వాడుతున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యం కన్నా హీ మ్యాన్‌లా కన్పించాలనే యావ..యువతను స్టెరాయిడ్స్ వైపు మళ్లిస్తోంది. మజిల్స్ మేనియాతో యువత గుండెపోటును కొని తెచ్చుకుంటున్నారు. ట్రైనర్స్ పర్యవేక్షణ లేకుండా అతి వ్యాయమం..తక్కువ టైమ్‌లో సల్మాన్‌ఖాన్ అయిపోవాలనే తపనతో స్టెరాయిడ్స్ వాడ్డం.. ఈ రెండూ ప్రజెంట్‌గా డేంజర్ సైరన్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఇదే అదనుగా కండలు పెంచాలనే తపనతో జిమ్ బాటపడుతున్న వాళ్లను టార్గెట్ చేస్తూ డ్రగ్ మాఫియా పంజా విసురుతోంది. డ్రగ్ దందాపై ఉక్కుపాదం మోపిన హైదరాబాద్ పోలీసులు..లేటెస్ట్‌గా స్టెరాయిడ్ రాకెట్‌కు బ్రేక్ చేశారు.
రాచకొండ కమీషనరేట్ పరిధిలోని హయత్‌నగర్ పీఎస్‌లో డేంజర్ ఇంజక్షన్స్ అమ్మే మెడికల్ మాఫియాను పట్టుకున్నారు SOT పోలీసులు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా స్టెరాయిడ్స్‌గా ఉపయోగించే అనేస్తటిక్, హార్మోన్స్ ఇంజక్షన్స్‌ను ఎక్కువ ధరకు అమ్ముతున్న హయత్‌నగర్‌లోని శ్రీనివాస ఆస్పత్రి కాంపౌండర్ బాలాజీ ధర్మాజీ, మ్యాక్సిక్యూర్ ఆస్పత్రి సిబ్బంది ప్రసాద్ గులాబ్‌రావ్‌ని పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 30 స్టెరాయిడ్స్ ఇంజక్షన్స్, 2 మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాందేడ్‌కి చెందిన వీళ్లిద్దరూ గత కొన్నేళ్లుగా ఎల్బీనగర్, హయత్‌నగర్ సహా ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ అలవాటు ఉన్నవారిని టార్గెట్ చేసి ఇంజక్షన్లు అమ్ముతున్నట్లు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు.
ఈ ఇంజక్షన్స్ వాడటం వల్ల మత్తుతోపాటు మజిల్స్ పెరగడానికి ఉపయోగపడతాయని కండలు పెంచాలనే యూత్ భావిస్తున్నారు. 268 రూపాయల ధర ఉన్న ఈ ఇంజక్షన్‌లను డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా వెయ్యి నుంచి 2 వేల రూపాయలకి అమ్ముతున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఐతే పట్టుబడ్డ బాలాజీ, ప్రసాద్ గులాబీరావుల వెనక ఆస్పత్రి యాజమాన్యం పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు.
మొత్తానికి కండల కోసం వెంపర్లాడి హర్మోన్ ఇంజక్షన్లు..ట్యాబ్లెట్లు వాడితే రెంటికి చెడ్డ రేవలా ఇటు ఫిజికల్‌గా అటు మెంటల్లీ సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..