- Telugu News Photo Gallery Business photos List of the top 5 safest compact SUVs in India as the prospect of safety checkout for details
Safest SUVs: దేశంలో అత్యంత సురక్షితమైన కార్లు ఇవే.. ధర కూడా రూ.10 లక్షల లోపే..
Safest SUVs in India: మీరు కొత్త కాంపాక్ట్ SUV కార్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే సేఫ్‌టీ ఫీచర్ల విషయంలో ఇసుమంత కూడా రాజీ పడకండి. మన దేశంలోనే హై సేఫ్టీ రేటింగ్స్, ఫీచర్స్‌తో కొన్ని కార్లు ఉన్నాయి. అవన్నీ కూడా గ్లోబల్ NCAPలో 17 పాయింట్లకు కనీసం 12 పాయింట్లు తెచ్చుకున్న సేఫేస్ట్ కార్లు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Apr 02, 2023 | 9:36 AM

Mahindra XUV300: మహీంద్రా XUV300 కూడా సేఫ్టీ రేటింగ్స్‌లో 5 స్టార్స్‌ను పొందింది. ముందు సీటు ప్రయాణీకుల భద్రత పరంగా 5 స్టార్స్, వెనుక సీట్ ప్రయాణికుల సేఫ్‌టీ పరంగా 4 స్టార్స్‌ను ఈ కారు సాధించుకుంది. సేఫ్‌టీ పాయింట్లలో ఈ కారు 17కు 16.42 స్కోర్ చేసింది. ఈ కారులో నాలుగు చక్రాల డిస్క్ బ్రేక్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టమ్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.8.41 లక్షలు.

Tata Nexon: టాటా నెక్సాన్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో ఒకటి. ఇక టాటా నెక్సన్ కారు.. గ్లోబల్ NCAPలో ఫైవ్ స్టార్ రేటింగ్‌తో సురక్షితమైన కారుగా గుర్తింపు పొందింది. ఈ కారు 17కి 16.06 పాయింట్లను సాధించింది. ఇందులో ABS, 2 ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ భద్రతా ఫీచర్లుగా ఉన్నాయి. దీని బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.79 లక్షలు.

Mahindra Thar: ఆఫ్-రోడ్ SUV మహింద్రా థార్ కూడా బలమైన సేఫ్‌టీ ఫీచర్లతో వస్తుంది. మహీంద్రా కంపెనీకి చెందిన ఈ కార్ గ్లోబల్ NCAP నుంచి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ SUV కారులో డ్రైవర్, ప్రయాణీకులకు మంచి ఛాతీ రక్షణ లభిస్తుంది. ఇక ఈ మహింద్రా థార్ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ కంపెనీకి చెందిన బ్రెజ్జా 2018 గ్లోబల్ NCAP కార్ సేఫ్టీ టెస్టింగ్‌లో 4 స్టార్ రేటింగ్‌ను పొందింది. స్కోర్ పరంగా కారు 17 పాయింట్లకు 12.5 తెచ్చుకుంది. కారు డ్రైవర్, తోటి ప్రయాణీకుల తల, మెడకు మంచి భద్రతను అందిస్తుంది. తద్వారా మారుతి సుజుకి బ్రెజ్జా భారతదేశపు అత్యంత సురక్షితమైన SUVలో కూడా చేర్చబడింది. ఈ మారుతి సుజుకీ బ్రెజ్జా బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.8.19 లక్షలు.

Tata Punch: టాటా కంపెనీ నుంచి వచ్చిన టాటా పంచ్ గ్లోబల్ NCAP కార్ టెస్ట్‌లో 17 పాయింట్లకు 16.45 పాయింట్లను సాధించింది. ఈ కార్ ఫ్రంట్ సీట్ ప్రయాణీకుల భద్రత పరంగా 5 స్టార్స్, బ్యాక్ సీటు ప్రయాణీకుల భద్రతకు 4 స్టార్స్ రేటింగ్ పొందింది. ఈ కారులో ABS, EBD, బ్రేక్ స్వే కంట్రోల్, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ వంటి అద్భుత ఫీచర్లు కూడా ఉండడం దీని ప్రత్యేకత. ఈ కారు బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.73 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.





























