- Telugu News Photo Gallery Business photos 5 popular motor bikes that you can buy instead of the iPhone 14 checkout for the details in Telugu
Cheap & Best Bikes: ఐఫోన్ 14 కంటే చౌకైన 5 కార్లు.. లీటర్ ప్రెట్రోల్‌కి 70 కి.మీ మైలేజ్ పక్కా..!
ఐఫోన్ 14 టాప్ మోడల్ ధర దాదాపు రూ.1 లక్షా 85 వేల రూపాయలు. అయితే దాని కంటే తక్కువ ధర కలిగి సూపర్ మైలేజ్ ఇచ్చే టాప్ బైక్స్ కొన్ని ఉన్నాయి. ఈ తరహాకు చెందిన టాప్ 5 బైక్స్ వివరాలను ఇప్పుడు చూద్దాం. .
శివలీల గోపి తుల్వా | Edited By: Ravi Kiran
Updated on: Apr 03, 2023 | 4:30 AM

Hero HF Deluxe: హీరో కంపెనీకి చెందిన ఈ హీరో హెచ్ డీలక్స్ ధర రూ.61,232 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 97.2 cc ఇంజిన్‌ని కలిగి ఉండడంతో పాటు 8.02 PS పవర్, 8.05 Nm మ్యాక్స్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 70kmpl (లీటర్‌కు 70 కిలోమీటర్లు) మైలేజీని ఇవ్వగలదు.

Bajaj CT 110X: బజాబ్ సీటీ 110ఎక్స్ ధర రూ.67,322 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 115.45 cc ఇంజిన్‌ను కలిగి ఉండడం వల్ల8.6 PS శక్తిని, 9.81Nm మ్యాక్స్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ బైక్ కూడా లీటరుకు 70కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు.

Bajaj Platina 110: బజాజ్ ప్లాటినా 110 ధర రూ.68,544 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 115.45 cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇంకా ఇది 8.60PS శక్తిని, 9.81 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లీటరుకు 70కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు.

Honda CD 110 Dream: రూ.71,133 నుంచి ప్రారంభమవుతున్న ఈ బైక్ 109.51 cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇంకా 8.79PS శక్తిని, 9.30 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల ఈ హోండా సీజీ 110 డ్రీమ్ బైక్.. లీటరుకు 65 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

Honda SP 125: హోండా ఎస్‌పీ 125 ధర రూ.84,204 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 123.94 cc ఇంజిన్‌ను కలిగి ఉండడంతో పాటు 10.8 PS పవర్‌ని, 10.9 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ బైక్ 65kmpl మైలేజీ ఇస్తుంది.





























