Safest Cars in India: భద్రతలో 5స్టార్ రేటింగ్.. ధర మాత్రం అందుబాటులోనే.. కొంటే ఇలాంటి కార్లనే కొనాలి..

కరోనా అనంతర పరిణామాల్లో ప్రతి కుటుంబం ఓ సొంత కారు కలిగి ఉండాలని భావిస్తోంది. అందుకే అవకాశం ఉన్నంత వరకూ అవసరమైతే లోన్ పెట్టి అయినా కారు కొనుగోలు చేస్తున్నారు. అయితే కొత్త వాహనం కొనాలనుకొనే వారు దానిలో అధునాతన ఫీచర్లు ఉన్నాయా? మైలేజీ బాగుంటుందా? ధర మన బడ్జెట్లో ఉందా? అని ఆలోచిస్తారు. కానీ చాలామంది ఓ ముఖ్యమైన విషయాన్ని అంతగా పట్టించుకోరు. అదే భద్రత. మీరు కొనుగోలు చేయాలనుకొనే కారు భద్రత ఎలా ఉంది అనే అంశాన్ని కూడా తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి కారు భద్రమైందా కాదా అనేది ఎలా తెలుస్తుంది? అందుకోసం గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌ ఉంది. ఇది కార్ల భ్రదతను, నాణ్యతను పరీక్షిస్తుంది. ఈ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఎంత రేటింగ్ వచ్చిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన దేశంలో అనువైన బడ్జెట్ లో ఈ క్రాష్ టెస్ట్ బెస్ట్ రేటింగ్ వచ్చిన కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Apr 03, 2023 | 6:00 AM

టాటా పంచ్.. 
టాటా మోటార్స్ తన మైక్రో ఎస్యూవీ, పంచ్‌ను అక్టోబర్ 2021లో  ప్రవేశపెట్టింది. లాంచ్ అయిన వెంటనే ఇది భారతదేశంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా మారింది. కరోనా మహమ్మారి సమయం, ఆంక్షలు, డెలివరీల విషయంలో కొన్ని ఇబ్బందులు అన్నింటినీ అధిగమించి ఇప్పటి వరకూ 1 లక్ష యూనిట్లకు పైగా పంచ్‌లను విక్రయించింది. టాటా పంచ్ అనేది ఒక మైక్రో ఎస్యూవీ, ఇది ఒక్కపెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే వస్తుంది. ఇది గ్లోబల్NCAPక్రాష్ టెస్ట్ పెద్దల విభాగంలో  16.45/17 పాయింట్లను స్కోర్ చేసి, 5 స్టార్ రేటింగ్‌ సాధించింది. అలాగే  పిల్లల భద్రతలో 40.89/49 పాయింట్లను సాధించి  4-స్టార్ రేటింగ్‌ అందుకొంది. టాటా పంచ్ ధర రూ. 5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

టాటా పంచ్.. టాటా మోటార్స్ తన మైక్రో ఎస్యూవీ, పంచ్‌ను అక్టోబర్ 2021లో ప్రవేశపెట్టింది. లాంచ్ అయిన వెంటనే ఇది భారతదేశంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా మారింది. కరోనా మహమ్మారి సమయం, ఆంక్షలు, డెలివరీల విషయంలో కొన్ని ఇబ్బందులు అన్నింటినీ అధిగమించి ఇప్పటి వరకూ 1 లక్ష యూనిట్లకు పైగా పంచ్‌లను విక్రయించింది. టాటా పంచ్ అనేది ఒక మైక్రో ఎస్యూవీ, ఇది ఒక్కపెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే వస్తుంది. ఇది గ్లోబల్NCAPక్రాష్ టెస్ట్ పెద్దల విభాగంలో 16.45/17 పాయింట్లను స్కోర్ చేసి, 5 స్టార్ రేటింగ్‌ సాధించింది. అలాగే పిల్లల భద్రతలో 40.89/49 పాయింట్లను సాధించి 4-స్టార్ రేటింగ్‌ అందుకొంది. టాటా పంచ్ ధర రూ. 5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

1 / 5
టాటా ఆల్ట్రోజ్..
గోల్డ్ స్టాండర్డ్ కారుగా కంపెనీ పరిచయం చేసింది. ఇది దేశంలోనే అత్యంత సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్.  గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌ ​​పెద్దల విభాగంలో 16.13/17 పాయింట్లను స్కోర్ చేసి, 5 స్టార్ రేటింగ్‌ అందుకుంది. అలాగే పిల్లల భద్రతలో 29/49 పాయింట్లను సాధించి,  3-స్టార్ రేటింగ్‌ పొందింది. టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 6.45 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

టాటా ఆల్ట్రోజ్.. గోల్డ్ స్టాండర్డ్ కారుగా కంపెనీ పరిచయం చేసింది. ఇది దేశంలోనే అత్యంత సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌ ​​పెద్దల విభాగంలో 16.13/17 పాయింట్లను స్కోర్ చేసి, 5 స్టార్ రేటింగ్‌ అందుకుంది. అలాగే పిల్లల భద్రతలో 29/49 పాయింట్లను సాధించి, 3-స్టార్ రేటింగ్‌ పొందింది. టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 6.45 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

2 / 5
టాటా నెక్సాన్.. 
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యూవీలలో ఒకటి.  ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ పిల్లల విభాగంలో  25/49 పాయింట్లను స్కోర్ చేసి, 3-స్టార్ రేటింగ్ సాధించింది. అలాగే పెద్దల భద్రతలో 16.06/17 పాయింట్లుసాధించి, 5 స్టార్ రేటింగ్‌ సొంతం చేసుకొంది. టాటా నెక్సాన్ ధర రూ. 7.80 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

టాటా నెక్సాన్.. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యూవీలలో ఒకటి. ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ పిల్లల విభాగంలో 25/49 పాయింట్లను స్కోర్ చేసి, 3-స్టార్ రేటింగ్ సాధించింది. అలాగే పెద్దల భద్రతలో 16.06/17 పాయింట్లుసాధించి, 5 స్టార్ రేటింగ్‌ సొంతం చేసుకొంది. టాటా నెక్సాన్ ధర రూ. 7.80 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

3 / 5
మహీంద్రా XUV300.. 
మహీంద్రా ఫిబ్రవరి 2019లో XUV300ని పరిచయం చేసింది. దీనిలో అనేక ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్లు ఉన్నాయి. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌ పెద్దల విభాగంలో 16.42/17 పాయింట్లు సాధించి, 5 స్టార్ రేటింగ్‌ అందుకుంది. ఇక పిల్లల భద్రతలో 37.49/49 పాయింట్లు సాధించి, 3-స్టార్ రేటింగ్‌ పొందింది. మహీంద్రా XUV300 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.41 లక్షలు.

మహీంద్రా XUV300.. మహీంద్రా ఫిబ్రవరి 2019లో XUV300ని పరిచయం చేసింది. దీనిలో అనేక ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్లు ఉన్నాయి. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌ పెద్దల విభాగంలో 16.42/17 పాయింట్లు సాధించి, 5 స్టార్ రేటింగ్‌ అందుకుంది. ఇక పిల్లల భద్రతలో 37.49/49 పాయింట్లు సాధించి, 3-స్టార్ రేటింగ్‌ పొందింది. మహీంద్రా XUV300 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.41 లక్షలు.

4 / 5
స్కోడా కుషాక్..
ఈ కారు గత సంవత్సరం మారిన  గ్లోబల్ NCAP నిబంధనల ప్రకారం పరీక్షించిన మొదటి కొన్ని కార్లలో ఒకటి.  పెద్దలు, పిల్లలకు 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. పెద్దల భద్రత పరీక్షలో 29.64/34 పాయింట్ల స్కోర్ చేయగా.. పిల్లల భద్రతలో 42/49 పాయింట్లను స్కోర్ చేసింది. స్కోడా కుషాక్ ధర రూ. 11.59 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

స్కోడా కుషాక్.. ఈ కారు గత సంవత్సరం మారిన గ్లోబల్ NCAP నిబంధనల ప్రకారం పరీక్షించిన మొదటి కొన్ని కార్లలో ఒకటి. పెద్దలు, పిల్లలకు 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. పెద్దల భద్రత పరీక్షలో 29.64/34 పాయింట్ల స్కోర్ చేయగా.. పిల్లల భద్రతలో 42/49 పాయింట్లను స్కోర్ చేసింది. స్కోడా కుషాక్ ధర రూ. 11.59 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

5 / 5
Follow us