- Telugu News Photo Gallery Business photos Know when PM Kisan 14th installment will come, how to do E KYC, Aadhaar bank account linking and land verification
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. ఇలా చేస్తేనే పీఎం కిసాన్ 14వ విడత నగదు జమ.. లేకపోతే..
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకువచ్చింది. వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరగడంతో.. సాయం అందించేందుకు కేంద్రం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించి.. ఏడాది ఆరువేల సాయాన్ని అందిస్తూ వస్తోంది. మూడు విడతల్లో ఈ సాయాన్ని రూ.రెండువేల చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేస్తోంది.
Updated on: Apr 03, 2023 | 12:30 PM

ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద సంవత్సరానికి 6 వేల రూపాయలు లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటివరు 13 విడతల సాయాన్ని రైతులకు పంపిణీ చేసింది. 2023 ఫిబ్రవరి 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 13వ విడతను లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేశారు. పీఎం కిసాన్ పథకంతో దాదాపు 8 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరింది.

అయితే, 13వ విడత నగదు జమ తర్వాత ఇప్పుడు రైతులు 14వ విడత (పీఎం కిసాన్ యోజన 14వ విడత అప్‌డేట్) సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వాయిదాల సొమ్మును రైతుల ఖాతాకు ఎప్పుడు బదిలీ చేస్తారనే విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకోండి.

అయితే, 14వ విడతలోపు కొన్ని విషయాలను రైతులు గమనించాల్సి ఉంటుంది. ఈ పథకంలో కాలానుగుణంగా కొన్ని మార్పులు చేశారు. ఆ అర్హతలు ఉన్న రైతులు మాత్రమే PM కిసాన్ యోజన ప్రయోజనం పొందుతారు. దీనిలో e-KYC కూడా ఒకటి, మీరు ఇప్పటి వరకు ఈ పనిని చేయకుంటే.. ఈ పనిని PM కిసాన్ పోర్టల్‌లో లేదా CSC కేంద్రాన్ని సందర్శించడం ద్వారా వెంటనే ఆన్‌లైన్‌లో చేయవచ్చు.

ఇది కాకుండా, ల్యాండ్ వెరిఫికేషన్ ప్రక్రియ, బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ చేసే పని కూడా చేయాలి. లేకపోతే 14వ విడత డబ్బు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

పీఎం కిసాన్ యోజన 14వ విడత నగదు జమ గురించి ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే, మీడియా కథనాల ప్రకారం ఏప్రిల్-జూన్ మధ్య రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలను జమ చేసే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.