Indians Railways: రైల్వే దుప్పట్లు, టవల్స్ దొంగిలిస్తే ఇక అంతే.. దొంగలకు ఏ చట్టం కింద శిక్ష పడుతుందంటే..?
రైల్వేకి సంబంధించిన ఏ వస్తువులను దొంగిలించినా.. దొంగలను శిక్షించేందుకు రైల్వే సంస్థకు ఒక ప్రత్యేక చట్టం ఉంది. దానిని అనుసరించే ఇండియన్ రైల్వేస్ దొంగలకు శిక్ష విధిస్తుంది. ఇక ఆ చట్టం ఏమిటంటే రైల్వే ప్రాపర్టీ..

రైల్వేకి సంబంధించిన ఏ వస్తువులను దొంగిలించినా.. దొంగలను శిక్షించేందుకు రైల్వే సంస్థకు ఒక ప్రత్యేక చట్టం ఉంది. దానిని అనుసరించే ఇండియన్ రైల్వేస్ దొంగలకు శిక్ష విధిస్తుంది. ఇక ఆ చట్టం ఏమిటంటే రైల్వే ప్రాపర్టీ యాక్ట్ 1966. అవును, ఈ చట్టం ప్రకారం ఎవరైనా రైల్వే ఆస్తులను దొంగిలించినట్లయితే లేదా ధ్వంసం చేసినట్లయినా.. బాధ్యలైనవారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఈ క్రమంలో బాధ్యులకు 1 సంవత్సరం జైలు శిక్ష లేదా రూ.1000 జరిమానా విధించే అధికారం రైల్వే సంస్థకు ఉంది. ఇంకా ధ్వంసమైన రైల్వే ఆస్తుల విలువను బట్టి కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం అంటే.. ఒకేసారి 1 సంవత్సరం జైలు శిక్ష, రూ.1000 జరిమానా రెండూ కూడా ఒకేసారి విధించవచ్చు. ఇంకా రైల్వే విధించే జైలు శిక్ష 1 సంవత్సరం నుంచి గరిష్టంగా 5 సంవత్సరాల వరకు ఉండవచ్చు.
అయితే మనలో చాలా మంది తమ ప్రయాణాల కోసం రైల్వేస్‌నే నమ్ముకుంటుంటారు. ఈ క్రమంలో స్లీపర్, ఏసీ కోచ్‌లలో ప్రయాణించేవారు కూడా ఉంటారు. అయితే అలా ప్రయాణించినవారిలో కొందరు రైల్వేస్‌కు సంబంధించిన టవల్స్, బెడ్ షీట్లు దొంగిలించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అవును, రైల్వేస్ నుంచి దొంగిలించబడిన వస్తువులపై పశ్చిమ రైల్వే జోన్ గతంలో విడుదల చేసిన గణాంకాలు చూస్తే నిజమే అనిపిస్తుంది. పశ్చిమ రైల్వే జోన్ గణాంకాల ప్రకారం 2017-18 మధ్య కాలంలో రైల్వేకు చెందిన 1.95 లక్షల టవల్స్, 81,776 బెడ్ షీట్లు, 5,038 దిండ్లు, 7,543 దుప్పట్లు దొంగతనానికి గురయ్యాయి.
ఇక ఈ గణాంకాలు చూస్తేనే అర్థమవుతుంది కదా రైల్వే పిరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అనేది. కాబట్టి మీరు ట్రెన్ ప్రయాణం చేస్తున్నప్పుడు.. మీ తోటి ప్రయాణికులు ఇలాంటి చోరీలకు పాల్పడితే వారిని వారించండి. వారికి రైల్వే చట్టం గురించి తెలియజేయండి. చోరికి పాల్పడుతున్న మీ తోటి ప్రయాణికులు అప్పటికీ వినకపోతే.. అందుబాటులో ఉన్న రైల్వే అధికారులకు లేదా రైల్వే విభాగానికి సమాచారం అందించండి. భారతదేశ బాధ్యతాయుతమైన పౌరుడిగా, రైల్వే ప్రయాణికుడిగా ఇది మీ కర్తవ్యం అని తప్పక గుర్తించండి.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







