- Telugu News Photo Gallery Viral photos Intermittent fasting: Experts say that abstaining from food in the name of fasting is not right
Fasting: ఉపవాసం పేరుతో ఆకలిని చంపేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసుకోండి..
సమయానికి ఆహారం తినకపోవడం, ఉపవాసం పేరుతో ప్రత్యేక రోజుల్లో ఆహారానికి దూరంగా ఉండటం సరైనది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఆడవారు సమయానికి ఆహారం తీసుకోకపోతే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.
Updated on: Apr 03, 2023 | 9:57 AM

ఆడవారు సమయానికి ఆహారం తీసుకోకపోతే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.

ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియ వేగంగా ఉంటుంది. భోజనానికి సమయపాలన పాటిస్తే, అదే సమయానికి ఆకలి వేసేలా శరీరంలో జీవక్రియలు జరుగుతుంటాయి. ఒకవేళ భోజనం మానేస్తే ఆకలి హార్మోన్లు ప్రభావితమవుతాయి. ముఖ్యంగా లెప్టిన్ హార్మోన్ క్రమేపీ ఆకలిని అణచివేస్తుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ దాటవేయడం మరింత ప్రమాదకరం. ఇలా చేస్తే శరీరంలోని జీవక్రియల వేగాన్ని పూర్తిగా తగ్గించేస్తుంది.

రాత్రిళ్లు డైటింగ్ పేరుతో సరైన ఆహారాన్ని తీసుకోకపోయినా, తెల్లవారిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ మానేసినా జీర్ణక్రియ విధానం దెబ్బతింటుంది. ప్రతి నాలుగైదు గంటలకొకసారి ఆహారాన్ని అందించకపోతే శరీరంలోని ఒత్తిడిని కలిగించే కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా ఆరోగ్యం కుంటుపడుతుంది.

పండుగ రోజుల్లో ఉపవాసాల పేరుతో ఆకలి వేస్తున్నా ఆహారానికి దూరంగా ఉండటం సరైన విధానం కాదంటున్నారు నిపుణులు. ఆహారం తీసుకోకపోయినా ద్రవపదార్ధాలైన తీసుకోవాలి. లేదంటే వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది.

బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే రక్తంలో చక్కెర స్థాయులు తగ్గుతాయి. ఉపవాసం చేసినా ఇదే జరుగుతుంది. అందుకే ఆహారానికి మధ్యలో నాలుగు నుంచి ఆరుగంటలు బ్రేక్ రాకుండా జాగ్రత్తపడాలి. లేదంటే చక్కెరస్థాయుల్లో హెచ్చుతగ్గులు వచ్చే ప్రమాదం ఉంది.




