AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Humanity! అయ్యో పాపం.. మనవడు ఐఏఎస్ ఆఫీసర్.. 30 కోట్ల ఆస్తి.. కొడుకు కోడలు చిత్ర హింసలు.. తిండి లేక వృద్ధ జంట ఆత్మహత్య

డబ్బులు, నగలు లేకపోతే తమ పిల్లలు వృద్ధాప్యంలో తమని చూడరు అని భావిస్తున్న తల్లిదండ్రులకు షాకింగ్ కలిగించే ఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది. తమ తల్లిదండ్రులను, తమ కుటుంబ సభ్యులను వృధ్యాప్యంలో ప్రేమగా చేసుకోవాలంటే కావాల్సింది కోట్ల ఆస్తులు కాదు.. ప్రేమ ఆప్యాయత, బంధం బాధ్యత మాత్రమే ఉండాలని నిరూపించే ఘటన ఒకటి హర్యానాలో చోటు చేసుకుంది.  

Humanity! అయ్యో పాపం.. మనవడు ఐఏఎస్ ఆఫీసర్.. 30 కోట్ల ఆస్తి.. కొడుకు కోడలు చిత్ర హింసలు.. తిండి లేక వృద్ధ జంట ఆత్మహత్య
Elderly Couple Ends Life
Surya Kala
|

Updated on: Apr 03, 2023 | 12:51 PM

Share

డబ్బులు, నగలు లేకపోతే తమ పిల్లలు వృద్ధాప్యంలో తమని చూడరు అని భావిస్తున్న తల్లిదండ్రులకు షాకింగ్ కలిగించే ఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది. తమ తల్లిదండ్రులను, తమ కుటుంబ సభ్యులను వృధ్యాప్యంలో ప్రేమగా చేసుకోవాలంటే కావాల్సింది కోట్ల ఆస్తులు కాదు.. ప్రేమ ఆప్యాయత, బంధం బాధ్యత మాత్రమే ఉండాలని నిరూపించే ఘటన ఒకటి హర్యానాలో చోటు చేసుకుంది.

హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లాలో విషాద ఘటన చోటూ చేసుకుంది. బుధవారం రాత్రి వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లాలోని బధ్రా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాము ఈ విపరీతమైన నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఆకలి అంటూ ఆ వృద్ధ దంపతులు రాసిన ఓ ఉత్తరం అందరి కంట కన్నీరు పెట్టిస్తోంది. మృతులు హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి తాత బామ్మలు. వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన సూసైడ్ నోటులో తమ మనవడు ఐఏఎస్ అధికారి అని.. అతని తల్లిదండ్రులు తమ కొడుకు కోడలు.. వీరిద్దరూ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారంటూ ఆరోపించారు.

మృతులు 78 ఏళ్ల జగదీష్ చంద్, అతని భార్య 77 ఏళ్ల భగ్లీగా గుర్తించారు. ఈ దంపతులు బధ్రా సమీపంలోని గోపి గ్రామానికి చెందినవారు. వృద్ధ దంపతులు నిద్ర మాత్రలు వేసుకుని తమ జీవితాన్ని ముగించుకున్నారని సమాచారం. ఐఏఎస్ అధికారి తల్లిదండ్రులు తమను హీనంగా చూస్తున్నారని.. సరైన ఆహారం అందించరని.. పాడైన ఆహారం ఇచ్చేవారంటూ సూసైడ్ నోట్‌లో మృతురాలు ఆరోపించింది.

అంతేకాదు.. తనకు పట్టణంలో సుమారు రూ. 30 కోట్ల విలువైన ఆస్తి ఉందని.. అయినప్పటికీ తమను తమ కొడుకు, కోడలు సరిగ్గా చూసేవారు కాదని.. కనీసం తినడానికి తిండి కూడా పెట్టేవారు కాదంటూ సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం..  తనను శారీరకంగా హించేవారని.. తనపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని శిక్షించినప్పుడే తన ఆత్మకు శాంతి చేకూరుతుందని రాశారు. తన ఆస్తి, ఫిక్స్‌డ్ డిపాజిట్లన్నింటినీ స్థానిక ఆర్యసమాజ్‌కు విరాళంగా ఇవ్వాలని ఆ లెటర్ లో పేర్కొన్నాడు.

తమ సొంత పిల్లల చేతిలో జరిగిన అవమానాన్ని భరించలేక తాము ఆత్మహత్య చేసుకున్నామని..  తమ చావుకు నీలమ్, వికాస్, సునీత, వీరేందర్ బాధ్యులని సూసైడ్ నోట్ లో ప్రస్తావించారు. ఈ ప్రపంచంలో ఏ పిల్లలూ తమ తల్లిదండ్రులను ఇలా చూసి ఉండరు.. ఈ లేఖను చదివిన వ్యక్తులకు మా అభ్యర్థన.. ఏమిటంటే ప్రభుత్వం తమ పిల్లలను శిక్షించాలని. అప్పుడే తమ ఆత్మలకు శాంతి చేకూరుతుంది” అని జగదీష్ చంద్ లెటర్ లో వెల్లడించాడు. ఈ కేసులో ఐఏఎస్‌ అధికారి తల్లిదండ్రులతోపాటు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..