Twitter logo changed: ట్విటర్ లోగో మారిందోచ్.. ‘పిట్ట పోయింది.. కుక్క వచ్చింది’
ట్విటర్ వినియోగదారులకు దాని అధినేత ఎలన్‌మస్క్ ఊహించని షాకిచ్చారు. ట్విటర్ బ్లూ బర్డ్ లోగోను మార్చేస్తున్నట్లు మంగళవారం (ఏప్రిల్ 4) ప్రకటించారు. దీంతో అన్ని ట్విటర్ అకౌంట్లకు క్లాసిక్ బ్లూ బర్డ్ లోగో స్థానంలో కుక్క లోగో ప్రత్యక్షమైంది. కేవలం మన దేశంలోనేకాకుండా..
ట్విటర్ వినియోగదారులకు దాని అధినేత ఎలన్‌మస్క్ ఊహించని షాకిచ్చారు. ట్విటర్ బ్లూ బర్డ్ లోగోను మార్చేస్తున్నట్లు మంగళవారం (ఏప్రిల్ 4) ప్రకటించారు. దీంతో అన్ని ట్విటర్ అకౌంట్లకు క్లాసిక్ బ్లూ బర్డ్ లోగో స్థానంలో కుక్క లోగో ప్రత్యక్షమైంది. కేవలం మన దేశంలోనేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలోని ట్విటర్ యూజర్లకు ఇదే లోగో కనిపించడంతో కాస్త పరేషాన్ అవుతున్నారు. దీంతో ఈ మైక్రోబ్లాగింగ్ సైట్‌లోకి లాగిన్ అయిన యూజర్లందరికీ పిట్ట లోగోకు బదులుగా కుక్క లోగో స్వాగతం పలుకుతోంది. ఈ మేరకు మస్క్ తన ట్విటర్ ఖాతాలో ‘నేను వాగ్దానం చేసినట్లు ట్విటర్‌ను కొనుగోలు చేశాను. బర్డ్‌లోగోనుకు బదులు డాగీ లోగో మార్చాను’ అంటూ రాసుకొచ్చారు. నిజానికి డాగీకాయిన్ అనే క్రిప్టోకరెన్సీలో ఈ డాగీ సింబల్ ఉంటుంది. డాగీకాయిన్ మస్కట్‌ను ట్విటర్ లోగోగా సోమవారం మార్చిన తర్వాత మెమె కాయిన్ విలువ దాదాపు 20 శాతం అంటే 0.092 డాలర్‌కు పెరిగింది. నెల రోజుల్లో పెరగవల్సిన విలువ ఒకే ఒక రోజులో పెరగడం విశేషం.
మరోవైపు క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్‌కు మద్దతుగా పిరమిడ్ స్కీమ్‌ను నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై ఎలన్ మస్క్‌పై 258 బిలియన్ డాలర్ల దావా కోర్టులో నడుస్తోంది. రాకెటీరింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని అమెరికా కోర్టులో మస్క్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఈక్రమంలో ట్విటర్ లోగోను క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్‌లోని కుక్క లోగోగా మార్చడం చర్చణీయాంశమైంది. కాగా గత ఏడాది ఎలన్ మస్క్ 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే.. ట్విటర్ లోగో కుక్కగా మారిపోవడంపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. చూస్తే మీరూ నవ్వాపుకోలేరు..
— Elon Musk (@elonmusk) April 3, 2023
As promised pic.twitter.com/Jc1TnAqxAV
— Elon Musk (@elonmusk) April 3, 2023
tweet tweet became woof woof ! pic.twitter.com/zz0HWtGBOh
— BabyDogeSwap.com LIVE (@BabyDogeCoin) April 3, 2023
Looks like #Floki is doing a pretty good job as CEO! pic.twitter.com/aIIPHdpnej
— FLOKI (@RealFlokiInu) April 3, 2023
— RR2Capital (@RR2Capital) April 3, 2023
ai/mj prompt in alt. pic.twitter.com/TjS7cgyQdS
— Pete Halvorsen (@petehalvorsen) April 3, 2023
Get lost bird, you too noisy!! pic.twitter.com/KyPynJySon
— Crypto Rand (@crypto_rand) April 3, 2023
— Omar Dalí (@omardali) April 3, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.