Kisan Vikas Patra : పోస్టాఫీస్‌లో ఉండే ఈ పథకం గురించి తెలుసా? లక్ష పెట్టుబడితో మరో లక్ష రాబడి
పెట్టుబడిదారులు కూడా ఎక్కువ వడ్డీ రేట్లు ఇచ్చే మంచి పథకాల గురించి వెతుకుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా బ్యాంకులు, పోస్టాఫీసులు వడ్డీ రేట్లు గణనీయంగా పెంచుతున్నాయి. ప్రస్తుతం పోస్టాఫీస్ వివిధ పథకాలకు వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఏప్రిల్ 1న ప్రకటించింది.
సాధారణంగా మనం కష్టపడి సంపాదించిన సొమ్మును మంచి రాబడి కోసం వివిధ పథకాల్లో పెట్టుబడి పెడతాం. బ్యాంకులు, పోస్టాఫీసు, వివిధ ఆర్థిక సంస్థలు అన్నీ పెట్టుబడిదారులకు నమ్మకం కలిగిస్తూ వివిధ పథకాలను ప్రవేశపెడతున్నాయి. పెట్టుబడిదారులు కూడా ఎక్కువ వడ్డీ రేట్లు ఇచ్చే మంచి పథకాల గురించి వెతుకుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా బ్యాంకులు, పోస్టాఫీసులు వడ్డీ రేట్లు గణనీయంగా పెంచుతున్నాయి. ప్రస్తుతం పోస్టాఫీస్ వివిధ పథకాలకు వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఏప్రిల్ 1న ప్రకటించింది. అయితే ప్రస్తుతం పోస్టాఫీసులో అందుబాటులో ఉన్న ఓ కొత్త పథకం గురించి ఓ సారి తెలుసుకుందాం. కిసాన్ వికాస్ పత్ర పేరుతో ఉండే ఈ పథకంలో మనం ఎంత పెట్టుబడి పెడితే అంత తిరిగి మనకు వస్తుంది. అంటే మనం ఓ లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే కొన్ని రోజుల తర్వాత లక్షకు మరో లక్షతో రూ.2 లక్షలు పెట్టుబడిదారులకు అందుతాయి. ముఖ్యంగా ఇటీవల కిసాన్ వికాస్ పత్రపై 7.5 శాతం వడ్డీని ప్రకటించారు. పెంచకముందు ఈ వడ్డీ రేట్ 7.2 శాతంగా ఉంది. బ్యాంకులన్నీ ఫిక్స్డ్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను గణనీయం పెంచడంతో ప్రభుత్వంపై కిసాస్ వికాస్ పత్ర తదితర పోస్టాఫీస్ పథకాలను వడ్డీని పెంచింది.
2023-24 మొదటి త్రైమాసిక ఆర్థిక సంవత్సరానికి కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) వడ్డీ రేటును 7.5 శాతం పెంచింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం కేవీపీ పథకం 115 నెలల్లో మెచ్యూర్ అవుతుంది. కేవీపీతో పాటు కేంద్రం వివిధ పోస్టల్ పథకాల రేట్లను కూడా పెంచింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ల వంటి పథకాలపై వడ్డీ రేట్లను సవరించింది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం