Online Gaming: కేవలం రూ.49 పెట్టుబడి.. ఆన్‌లైన్‌ గేమ్‌తో రాత్రికిరాత్రే కోటిశ్వరుడైన డ్రైవర్‌..

ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లో కేవలం రూ.49 పెట్టుబడి పెట్టి ఓ వ్యక్తి రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో రాత్రికి రాత్రే సదరు డ్రైవర్‌ కోటీశ్వరుడైపోయాడు. ఆదివారం (ఏప్రిల్‌ 2) కోల్‌కతా, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా యాప్‌లో వర్చువల్‌ క్రికెట్ టీమ్‌ను..

Online Gaming: కేవలం రూ.49 పెట్టుబడి.. ఆన్‌లైన్‌ గేమ్‌తో రాత్రికిరాత్రే కోటిశ్వరుడైన డ్రైవర్‌..
Online Gaming
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 04, 2023 | 10:26 AM

ఓ వైపు ఆన్‌లైన్‌ ఆటలతో యువత బతుకులు పరేషానవుతుంటే.. మరోవైపు ఆశల వల విసురుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాకు చెందిన ఓ డ్రైవర్ ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లో కేవలం రూ.49 పెట్టుబడి పెట్టి రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో రాత్రికి రాత్రే సదరు డ్రైవర్‌ కోటీశ్వరుడైపోయాడు. వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని సెంద్వాలో ఓ అద్దె ఇంట్లో షహబుద్దీన్ మన్సూరి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. డ్రైవర్‌ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. తన మొబైల్‌ ఫోన్‌లో గత రెండేళ్లుగా ఆన్‌లైన్ క్రికెట్ గేమ్‌లలో జట్లను ఏర్పాటు చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం (ఏప్రిల్‌ 2) కోల్‌కతా, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా యాప్‌లో వర్చువల్‌ క్రికెట్ టీమ్‌ను ఏర్పాటు చేయడంతో రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు.

షాహబుద్దీన్ గెలుపొందిన నగదు నుంచి రూ.20 లక్షలు విత్‌డ్రా చేశాడు. వీటిల్లో రూ.6 లక్షలు ట్యాక్స్‌ చెల్లించగా, మిగిలిన సొమ్ము అతని ఖాతాలో జమయ్యింది. తాను గెలిచిన డబ్బుతో సొంత ఇల్లు కల నెరవేర్చుకుంటానని, మిగిలిన మొత్తంతో సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తానని షహ బుద్దీన్‌ చెప్పుకొచ్చాడు. అదృష్టం కొద్దీ ఇలాంటి సంఘటనలు ఆడపాదడపా జరుగుతుంటాయి. ఐతే ఈ ఆన్‌లైన్‌ గేమ్‌ల మాయలోపడి ఎందరో యువత కోలుకోలేని నష్టాన్ని చవిచూశారు. దీంతో దేశంలోని పలు రాష్ట్రాలు ఆన్‌లైన్‌ గేమ్‌ యాప్‌లను నిషేధించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.