హనుమంతుడి విగ్రహాన్నే మింగేసిన చిన్నారి.. 6 గంటలకు పైగా గొంతులోనే.. చివరకు ఏమయ్యిందంటే..?

చాలా మంది చిన్నారులు  కనిపించిన ప్రతిదానిని నోటిలో పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే పెన్, స్పూన్, ఆడుకునే వస్తువులు, ముఖ్యంగా మట్టి వంటివి ఎప్పుడూ చిన్న పిల్లల నోటిలో నానుతూ ఉంటాయి. అయితే మహారాష్ట్రలో ఓ చిన్నారి ఏకంగా హనుమంతుడి విగ్రహాన్నే మింగేసింది. అదేంటీ హనుమంతుడ్ని

హనుమంతుడి విగ్రహాన్నే మింగేసిన చిన్నారి.. 6 గంటలకు పైగా గొంతులోనే.. చివరకు ఏమయ్యిందంటే..?
4 Years Old Kid
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 04, 2023 | 9:13 AM

చిన్నపిల్లలలో చాలా మంది  కనిపించిన ప్రతిదానిని నోటిలో పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే పెన్, స్పూన్, ఆడుకునే వస్తువులు, ముఖ్యంగా మట్టి వంటివి ఎప్పుడూ చిన్న పిల్లల నోటిలో నానుతూ ఉంటాయి. అయితే మహారాష్ట్రలో ఓ చిన్నారి ఏకంగా హనుమంతుడి విగ్రహాన్నే మింగేసింది. అదేంటీ హనుమంతుడ్ని మింగడమేంటని మీరు ఆశ్చర్యపోతున్నారా..! కానీ నిజమే ఇది. మహారాష్ట్ర హింగోలీ జిల్లాకు చెందిన నాలుగేళ్ల పాప తన మెడలో కట్టి ఉన్న 3 అంగుళాల హనుమంతుడి విగ్రహాన్ని పొరపాటున మింగేసింది. దీంతో ఆ విగ్రహం చిన్నారి గొంతులో ఇరుక్కుపోయింది. అయితే ఆ పాప గొంతులో ఇరుక్కున్న విగ్రహాన్ని తొలగించి వైద్యులు చిన్నారిని కాపాడారు.

సోమవారం మధ్యాహ్నం ఆ చిన్నారి అనుకోకుండా హనుమంతుడి విగ్రహాన్ని మింగేసింది. అయితే అది పూర్తిగా కడుపులోకి వెళ్లకుండా గొంతులో అడ్డుపడి ఉంది. దీంతో ఆ పాపకు ఊపిరి సమస్య తీసుకోవడంలో ఇబ్బందికలిగి.. ఉక్కిరిబిక్కిరి అయింది. వెంటనే ఆ చిన్నారి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఒక్కసారిగా షాక్​‌​ అయ్యారు. తల్లిదండ్రులు తక్షణమే ఆ చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు నాందేడ్​లోని గెలాక్సీ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. పరిస్థితి తీవ్రమైనదని, నాందేడ్‌ గెలాక్సీ ఆసుపత్రికి వెళ్తే తప్పకుండా చిన్నారి గొంతులోని విగ్రహాన్ని తొలగిస్తారని వారికి వైద్యులు చెప్పారు. ఇక ఆ వెంటనే పాప తల్లిదండ్రులు ఆమెను గెలాక్సీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే ఈ క్రమంలోనే పాపకు గొంతు నొప్పి ఎక్కువడంతో.. తల్లిదండ్రులు అందోళనకు గురయ్యారు. గెలాక్సీ ఆసుపత్రిలోని డాక్టర్ నితిన్ జోషీ విషయం తెలుసుకుని గంట సమయంలోనే చిన్నారి గొంతు నుంచి హనుమంతుడి విగ్రహాన్ని తొలగించారు. ఆ విగ్రహం దాదాపు 6 గంటలకు పైగా సమయం పాప గొంతులోనే ఉంది. అయితే చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పాప తల్లిదండ్రులకు డాక్టర్ జోషీ సూచించారు. పిల్లలకు అందుబాటులో ఉండే వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కూడా అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే