- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: MS Dhoni becomes 7th player in the list of IPL Players who have reached 5000 runs mark
IPL 2023: ‘వచ్చాడు.. కొట్టాడు.. రికార్డు సృష్టించాడు’.. ఐపీఎల్ తోపుల జాబితాలోకి ధోని.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..?
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై 12 పరుగుల తేడాతో గెలిచింది. అయితే చెన్నై బ్యాటింగ్ ఇన్నింగ్స్ సందర్భంగా మైదానంలోకి దిగి మూడే బంతుల్లో 12 పరుగులు చేశాడు చెన్నై కెప్టెన్ ధోని. దీంతో ధోని.. ఐపీఎల్ చరిత్రలో 5000 పరుగులు చేసి ఐపీఎల్ తోపుగా నిలిచాడు.
Updated on: Apr 04, 2023 | 8:40 AM

సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై 12 పరుగుల తేడాతో గెలిచింది. అయితే చెన్నై బ్యాటింగ్ ఇన్నింగ్స్ సందర్భంగా మైదానంలోకి దిగి మూడే బంతుల్లో 12 పరుగులు చేశాడు చెన్నై కెప్టెన్ ధోని. దీంతో ధోని.. ఐపీఎల్ చరిత్రలో 5000 పరుగులు చేసి ఐపీఎల్ తోపుగా నిలిచాడు.

అవును, చెన్నై బ్యాటింగ్ ఇన్నింగ్స్‌కి 5 బంతులే ఉన్నాయన్న సమయంలో వచ్చిన ధోని వరుసగా 2 సిక్సులు కొట్టాడు. అయితే మూడో బంతికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘వచ్చాడు.. కొట్టాడు.. రికార్డు సృష్టించాడు’ అన్న మాదిరిగా ధోని ఆడాడు.

అయితే ధోని కంటే ముందు ఐపీఎల్ క్రికెట్‌లో 5000 పరుగులు చేసిన ఆటగాళ్లు ఆరుగురు ఉన్నారు. అంటే ఆ లిస్టులో ధోని 7వ క్రికెటర్‌గా చేరాడు. మరి ఆ లిస్టులో ధోని కంటే ముందు ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు ఓ లుక్కేద్దాం..

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ లిస్టులో కింగ్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 216 ఇన్నింగ్స్ ఆడిన విరాట్.. మొత్తంగా 6,706 పరుగులు రాబట్టాడు. విశేషమేమిటంటే.. ఇప్పటివరకు కోహ్లీ ఐపీఎల్‌లో ఆడిన ప్రతి మ్యాచ్ కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫునే ఆడాడు.

కింగ్ కోహ్లీ తర్వాత ఈ లిస్టులో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఉన్నాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో 206 ఇన్నింగ్స్ ఆడిన ధావన్.. మొత్తం 6,284 పరుగులు చేశాడు.

ఈ లిస్టులో ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు. మొత్తం 5,937 పరుగులు చేసిన వార్నర్ మామ ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. ఇందుకోసం వార్నర్ 163 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.

ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 5,880 పరుగులతో ఈ లిస్టు నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక రోహింత్ ఈ పరుగుల కోసం మొత్తం 223 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.

అలాగే ఐపీఎల్ పరుగుల వీరులలో సురేష్ రైనా కూడా ఉన్నాడు. మొత్తం 5,528 పరుగులు చేసిన సురేష్ రైనా.. అందుకోసం 200 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.

ఇక ఏబీ డివిలియర్స్ 5,162 పరుగులతో 6వ స్థానంలో ఉన్నాడు. మొత్తం 170 ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడిన ఏబీ ఈ పరుగులు చేశాడు.

ఈ క్రమంలనే తాజాగా చెన్నై టీమ్ కెప్టెన్ ధోని కూడా చేరాడు. మొత్తం 208 ఇన్నింగ్స్ ఆడిన ధోని 5004 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ క్రికెట్‌లో 5000 పరుగుల మార్క్ అందుకున్న 7వ ప్లేయర్‌గా ధోని నిలిచాడు.





























